పల్స్ ఆక్సిమీటర్ కీలకం
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiC993XMvRdNhWitdFVKeXoX3fYeYi3DwFsyhJLAFviWV1gq6qyKSy81jZFVGjd0bRjCM0RE53e0oTnukcH5QZKJyCqQ_MsEqWRUA7XyOTUPXy-ITPN9iu5TSS1LN8NKcox2bDi1S6e-1hF/s1600/1619666646541247-0.png)
కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్ ఆక్సిమీటర్ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి.* *కరోనా వైరస్ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్ ఆక్సిమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది.* *కోవిడ్ రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. రోగుల్లో రక్తంలోకి చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా పల్స్ ఆక్సిమీటర్ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు. కోవిడ్ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటవది సింప్టమాటిక్ కేసు. ఇందులో లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేవాళ్లు, రెండవది అసింప్టమాటిక్ కేసు. అంటే ఒంట్లో వైరస్...