పోస్ట్‌లు

ఆగస్టు, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎక్మో చికిత్స అంటే ?

బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా  చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు)     *ఎక్మో*  ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).                    *ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో* *ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో  ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి... ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున...

ప్రశాంతమైన వృధ్ధాప్య జీవనం గడిపేందుకు ..

1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి.. ✊లేదా మీకు సౌకర్యం అనిపించిన చిన్న ఇంట్లో హాయిగా గడపండి ! 2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు  స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. ✍ 3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.  🤔 4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...🤓 5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..😞 6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.🤗  7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి... 👐👐  8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వ...

డెంగీ_నివారణకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు

*            దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.     * హఠాత్తుగా తీవ్రజ్వరం  * తీవ్రమైన తలనొప్పి  * కళ్ల వెనుక నుంచి నొప్పి     *ఒళ్లు-కీళ్ల నొప్పులు* వాంతి వికారం  * ఆకలి లేకపోవటం     ... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.    ఈ దోమ చాలా స్పెషల్‌!     ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్‌ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా ...