పోస్ట్‌లు

2022లోని పోస్ట్‌లను చూపుతోంది

lung cancer symptoms

ముఖ భాగంలో లంగ్ కేన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..!    ap7am.com,     31-05-2022 Tue 13:05 చెవి వెనుక భాగంలో నొప్పి కొన్ని సందర్భాల్లో దవడ భాగానికీ విస్తరణ ముఖంపై వాపులు, నొప్పి ఊపిరితిత్తుల చుట్టూ నీరు వెన్ను నొప్పి కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే నిశ్శబ్దంగా ప్రాణాలను కబళించే కేన్సర్ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా ఒక సంక్షోభంగా మన మధ్యే కొనసాగుతోంది. ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతుండడం ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అంశం. కేన్సర్లలో నూ లంగ్ కేన్సర్ కు సంబంధించి లక్షణాలు పెద్దగా తెలియవు. ముందుగా గుర్తిస్తేనే ఈ మహమ్మారి ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు.  కేన్సర్ తొలి నాళ్లలో గుర్తించడం కష్టం. కేన్సర్ కణాలు మరింత పెరిగిపోయి, విస్తరించిన తర్వాతే ప్రభావాలు బయటకు కనిపిస్తుంటాయి. అప్పటికే అది మూడు, లేదంటే నాలుగో దశకు చేరిపోయి ఉంటుంది. దాంతో ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే, లంగ్ కేన్సర్ లో కొన్ని లక్షణాలు ముఖ భాగంలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా నొప్పితో బాధపడడం కేన్సర్ లక్షణాల్లో ఒకటి. చెవి వెనుక భాగంలో టెంపోరియల్ రీజియన్ లో నొప్పి వస్తుంటుంది. అక్కడి నుంచి ద...

బొజ్జ రాకుండా ఉండాలంటే..!

ముప్ఫయ్యేళ్ల వయస్సు దాటిన తరువాత బొజ్జ రావడం సహజంగా కనిపిస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బొజ్జ రాదని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో అతి ముఖ్యమైనది ప్లేటు పరిమాణం. పెద్ద ప్లేటులో అన్నం తిన్నప్పుడు చాలా ఎక్కువగా తింటాం. అలా ఆకుండా, చిన్న ప్లేటులో అన్నం తింటే తక్కువ పరిమాణంలో తింటాం. ఇదేకాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం. - బాగా పొద్దు పోయాకా భోజనం చేయకూడదు. మరీ ఆకలిగా ఉంటే పండ్లు కాని, స్నాక్స్ కాని తినడం మంచిది. - భోజనం చేసిన సమయానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి.. - భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. దీనికి దూరంగా ఉండాలి. కొంతమంది విచారంలో ఉన్నప్పుడు కాని, సంతోషంగా ఉన్నప్పుడు కాని, కోపంగా ఉన్నప్పుడు కాని ఎప్పుడూ తినే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు. దీనికి దూరంగా ఉండాలి. భావోద్వేగాలకు గురైనప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఉత్తమం. - నిద్రలేమి లేదా తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యల వల్ల కూడా బొజ్జ పెరిగే అవకాశాలున్నాయి. కనుక తగిన స్థాయిలో నిద్రపోవాలి.