బొజ్జ రాకుండా ఉండాలంటే..!
ముప్ఫయ్యేళ్ల వయస్సు దాటిన తరువాత బొజ్జ రావడం సహజంగా కనిపిస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బొజ్జ రాదని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో అతి ముఖ్యమైనది ప్లేటు పరిమాణం. పెద్ద ప్లేటులో అన్నం తిన్నప్పుడు చాలా ఎక్కువగా తింటాం. అలా ఆకుండా, చిన్న ప్లేటులో అన్నం తింటే తక్కువ పరిమాణంలో తింటాం. ఇదేకాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం. - బాగా పొద్దు పోయాకా భోజనం చేయకూడదు. మరీ ఆకలిగా ఉంటే పండ్లు కాని, స్నాక్స్ కాని తినడం మంచిది. - భోజనం చేసిన సమయానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి.. - భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. దీనికి దూరంగా ఉండాలి. కొంతమంది విచారంలో ఉన్నప్పుడు కాని, సంతోషంగా ఉన్నప్పుడు కాని, కోపంగా ఉన్నప్పుడు కాని ఎప్పుడూ తినే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు. దీనికి దూరంగా ఉండాలి. భావోద్వేగాలకు గురైనప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఉత్తమం. - నిద్రలేమి లేదా తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యల వల్ల కూడా బొజ్జ పెరిగే అవకాశాలున్నాయి. కనుక తగిన స్థాయిలో నిద్రపోవాలి.