SOUR SPINACH / గోంగూర
ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. ఈ ఆకు కూర గురించి తెలియని వారుండరు. గోంగూరతో మనం పచ్చడిని, పప్పును, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందొచ్చు. *_🍃గోంగూర ఆకుల (Sorrel Leaves)తోనే కాకుండా గోంగూర కాయల మీద ఉండే పొట్టుతో కూడా పచ్చడిని తయారు చేస్తారు. గోంగూర ఆకులతోపాటు కాయలు, పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గోంగూరను పంటగా వేసి వాటి నుంచి నారను తీసి సంచులను తయారు చేస్తుంటారు. మనకు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర వంటి రెండు రకాల గోంగూరలు లభిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూరతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి._🍃* *_🍃గోం...