ముల్లంగి(Radish)
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgkGTfPbQ5Jt9IUKSS3hj_vFqIAHtNcHRY__y0fxG_o-IG-puZi-6t6YpDB3z8_ox-r-Ywne86ysPkONBanMko71Ygw8xSofbOggzSi-kHxOpFGS3UUFOvKLBelCgRkvw_3UGyeANrYhZvk/s1600/1611635029062704-0.png)
Radish చలికాలం రాగానే ముల్లంగి ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లగా మెరిసిపోతూ ఉండే ముల్లంగి అందంగా కనిపించినా తినటానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు తక్కువే. మహా అయితే ఒకటో రెండో ముక్కలు సాంబార్‌లో వేసుకుంటారు. అంతే తప్పితే, ముల్లంగిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ముల్లంగిని తినటం చాలా మంచిది… లివర్‌ని మంచి కండిషన్‌లో ఉంచుతుంది ముల్లంగి. బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జనలో ఏర్పడే మంటను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్ గా తినటం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడవు. రెస్పిరేటరీ సమస్యలను తగ్గిస్తుంది ముల్లంగి. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, అలర్జీలని తగ్గిస్తుంది. ముల్లంగిలో విటమిన్ సి...