ముల్లంగి(Radish)


                Radish

            చలికాలం రాగానే ముల్లంగి ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లగా మెరిసిపోతూ ఉండే ముల్లంగి అందంగా కనిపించినా తినటానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు తక్కువే. మహా అయితే ఒకటో రెండో ముక్కలు సాంబార్‌‌లో వేసుకుంటారు. అంతే తప్పితే, ముల్లంగిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ముల్లంగిని తినటం చాలా మంచిది…

  • లివర్‌‌ని మంచి కండిషన్‌లో ఉంచుతుంది ముల్లంగి. బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ముల్లంగికి శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జనలో ఏర్పడే మంటను తగ్గించటానికి ఉపయోగపడుతుంది.
  • ముల్లంగిని రెగ్యులర్ గా తినటం వల్ల కిడ్నీలు, యూరినరీ సిస్టమ్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడవు.
  • రెస్పిరేటరీ సమస్యలను తగ్గిస్తుంది ముల్లంగి. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, అలర్జీలని తగ్గిస్తుంది.
  • ముల్లంగిలో విటమిన్ సి, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉండటం వల్ల స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. క్లెన్సర్, ఫేస్ ప్యాక్ గా వాడటం వల్ల స్కిన్ ని సున్నితంగా..అందంగా మార్చుతుంది.
  • అందుకే చలికాలం దొరికే ఈ ముల్లంగిని పక్కన పెట్టేయకుండా తినటం అలవాటు చేసుకుంటే హెల్త్​కు చాలా మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid