మెనోపాస్/ఆండ్రోపాస్
ఒక వయసు వచ్చే సరికి స్త్రీ మరియు పురుషులలో హార్మోన్ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే స్త్రీ లు ఒక 40 లేదా 45 సంవత్సరాలు వచ్చేసరికి వారికి మెనోపాస్(MENOPAUSE) లక్షణాలు కనిపిస్తుంటాయి. స్త్రీ లకు నెలసరి ఆగిపోయే సమయానికి ముందు వచ్చే సమయాన్ని మోనోపాస్ అంటారు. ఇది కొన్ని హార్మోన్స్ అసంతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వలన మోనోపాస్ సమయంలో కొన్ని ఆసవకార్యాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మగవారిలో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మగవారిలో వచ్చే సమస్య ను ఆండ్రోపాస్(ANDROPAUSE) అంటారు. ఆండ్రోపాస్ సమస్య వినని వారు చాలా మందే ఉంటారు.
అయితే పురుషులలో ఆండ్రోజెన్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడాన్ని ఆండ్రోపాస్ అంటారు. మహిళల లో మోనోపాస్ దశ వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే వారిలో మోనోపాస్ దశ లో పిరియడ్స్ ఆగిపోతాయి. అలాగే మగవారిలో ఆండ్రోపాస్ దశ వచ్చింది అని తెలియాలి అంటే 13 రకాల లక్షణాలలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈ లక్షణాలలో మొదటిది శృంగారం పై ఆసక్తి తగ్గుతుంది. రెండవది పురుషులలో 40 లేదా 45 సంవత్సరాలు వచ్చే సరికి అంగం గట్టిపడటం ఆగిపోతుంది. మూడవ సమస్య వచ్చే సరికి మగవారి వీ*ర్యం కణాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇక నాలుగవది మూడ్ స్వింగ్స్ ఈ సమస్య మగవారిలో మరియు ఆడవారిలో ఇద్దరిలోనూ కనపడుతుంది.
ఐదవది మానసికంగా ఒత్తిడి కి గురి అయి బాధపడుతుంటారు. ఆరవది మగవారిలో కండబలం చిన్న చిన్న గా తగ్గిపోతుంది. ఏడవది హార్మోన్స్ చేంజ్ అవ్వడం వలన బరువు పెరగడం మొదలు అవుతుంది. ఎనిమిదవది నిద్రలేని సమస్య, తొమ్మిదవది చిటికి మాటికి కోపం రావడం లాంటివి జరుగుతాయి. పదవది బద్దకంగా, నీరసంగా తయారు అవుతారు. పదకొండవది రాత్రి సమయంలో చెమటలు పడుతుంటాయి. పన్నేడవది ఎముకలలో పటుత్వం తగ్గి గుల్లబారి పోతాయి. ఇక పదమూడవది ఏ పని మీద సరిగా దృష్టి పెట్టలేకపోతుంటారు. ఈ పదమూడు లక్షణాలు కనిపించాయి అంటే మగవారిలో ఆండ్రోపాస్ దశ మొదలు అయింది అని అర్దం చేస్కోవాలి .
మగవారిలో కొంత మంది లో అయితే ఈ ఆండ్రోపాస్ దశ డయాబేటీస్, అధిక బరువు కారణం గా ఈ దశ 30 మరియు 35 సంవత్సరాల వయసు లోనే కనబడుతుంది. మగవారిలో ఈ పదమూడు లక్షణాలు కనిపించిది అంటే టెస్టోస్టెరాన్ లేవల్స్ తగ్గాయి అని అర్దం. మగవారిలో ఈ ఆండ్రోపాస్ దశ త్వరగా మొదలు అవ్వకుండా మీ లైఫ్ స్టైల్ కి ఖచ్చితంగా మార్చుకోవాలి. అయితే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పెరగాలి అంటే అవకాడో ఫ్రూట్ ని తినడం మొదలు పెట్టాలి. ఇధే కాకుండా రాత్రి ఆహారంలో భాగంగా పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న వాల్ నట్స్, విటమిన్ e ఎక్కువగా ఉన్న పొద్దుతిరుగుడు పప్పు ఈ నాలుగు రకాల పప్పులు నాగబెట్టుకొని తినడం వలన టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి కి చాలా బాగా ఉపయోగపడుతాయి.,వీటితో పాటు గా సాయంకాలం వేళలో డ్రై బెర్రీ ఫ్రూయిట్స్ తినడం వలన టెస్టోస్టెరాన్ లేవల్స్ పెరుగుతాయి.
(fbhealthy.com)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి