శలభాసనము
మిడత ఆకారంలో ఉంటాం ఈ ఆసనములో
1. మకరాసనములో విశ్రాంతిగా ఉండవలయును.
2. చేతి బొటన వేలు రెండింటిని లోపలుంచి, చేతి పిడికిళ్ళు మూసి పొతి ఊతకడుపు
క్రింద ఉంచవలయును.
3. ఊపిరిని క్రమంగా పీల్చి, మోకాళ్ళను వంచకుండా కాళ్ళను నడుమభాగము
నుంచి ఒకే మారు పైకెత్తవలయును.
4. కొంచెం సేపు అలానే ఉండి, నెమ్మదిగా కాళ్ళను క్రిందికి దింపవలయును.
శలభాసనము వేయుటకు శ్రమ అధికం- అధిక రక్తపోటు గలవారు, గుండె
బలహీనముగా ఉండినటువంటి వారు పెస్టిక్ అల్సర్, హెర్నియా వ్యాధి గలవారు
ఈ ఆసనములు వేయరాదు.
ప్రయోజనములు:
వీపు వెనుక క్రింది భాగములు, పెల్విన్ కండరాలు, సయాటిక్ నరాలను
ఉత్తేజ పరచగలదీ ఆసనము. కాలేయం, ఉదర సంబంధ అంగాలను సక్రమంగా
పనిచేయుటకు సహాయపడటమేగాక ఉదర సంబంధ వ్యాధులను నివారించగలదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి