మార్జాలాసనము
మర్జరీ ఆసనము
దీనినే మార్జాలాసనము అని కూడా పేర్కొనవచ్చును.
పిల్లి ఆకారములో
ఉంటుంది. కాబట్టి దీనికా పేరు.
1. వజ్రాసనములో కూర్చోవలయును.
2. పిరుదులను పైకెత్తి మోకాళ్ళపై నుంచుని అరచేతులను నేలపై ఉంచవలయును.
3. మోకాళ్ళని కొద్దిగా ఎడం చేయవలయును.
4. మోకాళ్ళతో సరిసమానంగా చేతుల మధ్య గ్యాప్ ఉంచవలయును.
• 5.దీనిని ప్రారంభ దశగా భావించవలయును.
6.తలపైకెత్తి నెమ్మదిగా శ్వాసపీలుస్తూ వెన్నెముకనూ లోపలివైపుగా అణుస్తూ
వీపును పల్లం చేయవలయును.
7. తలను నెమ్మదిగా క్రిందకి వాల్చి వెన్నెముకను పైకి వచ్చేలా ఉపిరి
వదలవలయును. ఉపిరి వదిలే ఆఖరు సమయంలో పొట్టను సంకోచింపజేస్తూ
తొడలకు అభిముఖంగా రెండు చేతుల మధ్య తలను ఉంచి పొట్టని
సంకోచింపజేయవలయును.
క్రమం తప్పకుండా నిత్యము 5 నుంచి 10 సార్లు చేయవచ్చును.
వెన్నెముకపై నుండి క్రిందకి క్రమంగా వంగినప్పుడు శ్వాస, శరీర కదలికలు
ఒకదానిలో ఒకటి సింక్రనైజ్
కావలయును.
ప్రయోజనములు:
భుజములు, మెడభాగము, వెన్నెముకలలో సాగే తత్వాన్ని ఆసనం వలన
పెంపొందించుకోగలం. స్త్రీలకు వునరుత్పత్తి క్రమముగా మృదువుగా
క్రమబద్ధీకరించగలదు. గర్భవతులైన స్త్రీలు ఈ ఆసనము ఆరోమాసం వరకు
చేయవచ్చును. స్త్రీలలో ఋతుసావక సమయాలలో కలిగే బాధలకు ఉపశమనం
కలిగిస్తుంది ఈ ఆసనము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి