అర్థ శలభాసనము
మిడత ఆకారములో సగం మాత్రమే ఉంటాం. ఈ ఆసనంలో
1. మకరాసనములో విశ్రాంతిగా ఉండవలయును.
2. పిడికిళ్ళు బిగించి, తొడల క్రిందకు పొత్తికడుపు క్రిందుగా మోకాళ్ళను
వంచకుండా కాళ్ళను నడుము భాగము నుంచి పైకి ఎత్తవలయును.
3. నడుము కండరాలను ఉపయోగించి ఎడమకాలు వీలయినంతవరకు ఎత్తుకు
ఎత్తవలయును. రెండకాలు తిన్నగా నేలకు ఆనించి ఉంచవలయును.
4. క్రమక్రమంగా ఎడమకాలిని యథాస్థితికి తీసుకురావలయును.
5. పై ప్రకారంగా కుడికాలితో కూడా సాధన చేయవలయును. పై ప్రకారంగా
10 సెకన్లు నుండి 30 సెకన్ల వరకు చేయవచును. పై విధముగా 5 లేక 6 సార్లు
సాధన చేయవలయును.
ప్రయోజనాలు:
తుంటి, కటి ప్రదేశములందలి కండరరములను శక్తివంతం చేసి సయాటి
కాలను నివారించడంలోనేగాక మలబద్ధకము తగ్గించగలదు. మూత్రపిండ ములు
ఈ ఆసనము వేయటం వలన చైతన్యవంతమవుతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి