మెగ్నీషియంతినండి.. ఆరోగ్యంగా ఉండండి!



👉మెగ్నీషియం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను అందించి ఆదుకుంటుంది. ఇది ఇలాగే కొనసాగితే, చివరకు మూత్రపిండాలు చెడిపోతాయి. ఇది మాంసకృత్తుల తయారీ, పిండిపదార్థాల జీవక్రియలో సహకారకంగా పనిచేస్తుంది. తగినంత మెగ్నీషియం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులతో ముడిపడి ఉన్న ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా పెంచుతుంది. 

👉నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. మెగ్నీషియం యొక్క రోజువారీ అవసరం పురుషులకు 400-420 మి.గ్రా, b 350-360 మి.గ్రా. అవసరం. మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మనం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం సరైన పాళ్లలో శరీరానికి అందాలి. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైంల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచీ మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియంది కీలక పాత్ర. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, నరాలు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండాలంటే కూడా మెగ్నీషియం ఎంతో అవసరం. 

👉మెగ్నీషియం గుమ్మడికాయ గింజల్లో ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయల్లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు డార్క్ చాకొలెట్స్‌లలో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఖర్జూరాలు, బఠాణీలు, కోకో, బ్రకోలీ, క్యాబేజీ, గ్రీన్ బఠాణీలు, మొలకలు, సాల్మన్‌ చేపలు, ట్యూనా చేపలు, బ్రౌన్‌రైస్‌లతో మెగ్నీషియం దొరుకుతుంది.

👉గింజలు : బాదం, జీడిపప్పు, బ్రెజిల్ గింజలు మెగ్నీషియం లభించే మంచి వనరులు. 

👉అవోకాడో : అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మధ్య తరహా అవోకాడోలో 58 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.

👉డార్క్ చాక్లెట్స్‌ : డార్క్ చాక్లెట్ మెగ్నీషియం యొక్క మంచి మూలం. డార్క్ చాక్లెట్‌ను మితంగా తినడం వల్ల ఇనుము, రాగి, మెగ్నీషియం, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.

👉చిక్కుళ్ళు : శాకాహారులకు సూపర్ ఫుడ్స్‌లో చిక్కుళ్ళు ఒకటి. ఆహారంలో చిక్కుళ్ళకు స్థానం కల్పించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

👉టోఫు : శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ మూలం. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఎక్కువ లభిస్తుంది. సలాడ్లు, శాండ్‌విచ్‌లు, ఇతర వంటకాలకు టోఫు చేయవచ్చు.

👉అరటి : అరటిపండ్లలో కావాలిసనంత మెగ్నీషియం లభిస్తుంది. అరటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు సంఖ్య తగ్గుతుంది.

👉తృణధాన్యాలు : తృణధాన్యాలు ఫైబర్‌తో లోడై ఉంటాయి. గోధుమలు, ఓట్స్, బుక్వీట్, బార్లీ వంటి ధాన్యాలు మంచి మెగ్నీషియం వనరులు. తృణధాన్యాలు ఆహారంలో చేర్చడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని నియంత్రించవచ్చు.

👉ఆకుకూరలు : రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చడం చాలా మంచి నిర్ణయం. ఆకుకూరలు అవసరమైన పోషకాలతో లోడై ఉంటాయి. బచ్చలికూర, పాలకూరల్లో మెగ్నీషియంతోపాటు ఇతర ముఖ్య పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆకుకూరలలో ఒకటి. 

👉విత్తనాలు : గుమ్మడి గింజలు కాకుండా, అవిసె గింజలు, చియా విత్తనాలు కూడా మెగ్నీషియం యొక్క మంచి వనరులు. సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు విత్తనాలు తినడం మంచి అలవాటు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid