హలాసనము




నాగలి ఆకారంలో ఉంటాము ఈ ఆసనములో
1. చేతులను తలమీదుగా నేలపైకి చాపి వెల్లికిలా పడుకోవాలి. కాళ్ళను తిన్నగా
ఉంచి పాదాలను ఒకచోట ఉంచాలి. రెండు కాళ్ళను నెమ్మదిగా తిన్నగా భూమికి
45 డిగ్రీలలో పైకెత్తాలి. కాళ్ళను ఇంకా పైకెత్తి 90 డిగ్రీల వరకూ రానివ్వాలి
చేతులను శరీరము ప్రక్కల నుంచవలయును.
2. వీపును కటి ప్రదేశమును చేతుల సహాయముతో పైకెత్తవలయును. మోచేతులను
నేలపై ఉంచి, వీపును అరచేతులతో నిలబెట్టవలెను. చేతుల సహకారముతో శరీరమును
నడుము వరకు నిలువుగా ఉంచవలయును. చుబుకాన్ని మెడకు దగ్గరగా
ఉంచవలయును. కాళ్ళు నేలకి సమాంతరంగా ఉంచవలెను.
- 3. ఈసారి కాళ్ళను మెల్లగా తలపై భాగము పైకి దించుతూ నడుముని
పట్టుకోవలయును.
ప్రయోజనములు:
వీపు కండరములు, కీళ్ళు, కటి ప్రదేశము నందలి నరములు సాగుట
వలన ఆరోగ్యము చేకూరును. మెడ ప్రాంతములో రక్త ప్రసరణ అధికమగును.
థైరాయిడ్ గ్రంథి, వెన్నెముకల సామర్థ్యము పెరగగలదు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid