పాదహస్తాసనము
పాదాలను చేతులతో తాకుతాం ఈ ఆసనములో
1. విశ్రాంతిగా నిల్చుని ఉండాలి.
2. మడమలకు కలిపి ఉంచి, చేతులను, నేలకు సమాంతరంగా పైకెత్తవలయును.
3. ఊపిరి పీల్చుతూ, చేతులు చెవులకు తాకునట్లుగా తల మీదుగా పూర్తిగా
పైకి తీసుకుని రావలయును.
4. శరీరము నేలకు సమాంతరంగా ఉండేటట్లుగా ముందుకి వంగవలయును.
వంగినప్పుడు, నడుము పూర్తిగా ముందుకు లాగుటకు ప్రయత్నించవలయును. ఊపిరి
వదులచూ అరచేతులను పాదముల ప్రక్కగా నేలపై ఉంచి, నుదురు, మోకాళ్లను
తాకే వరకు వంగవలయును. ఈ పరిస్థితుల్లో మోకాళ్లను వంచటానికి
ప్రయత్నించరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములతో సుమారు రెండు నిమిషములు ఆ విధంగా
ఉండగలగటానికి ప్రయత్నించవలయును.
5. క్రమంగా మెల్లగా యథాస్థితికి రావలయును.
నడుము నొప్పి గలవారూ, గుండె జబ్బులున్నవారూ వేయకూడదు ఈ ఆసనం.
అలాగే అధిక రక్తపోటు గలవారూ, హెర్నియా గలవారూ వేయకూడదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి