Awareness About Cancer


ప్రాణాంతకర వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటిగా చెప్పవచ్చు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలను బహిర్గత పరుస్తుంది. వీటి గురించి ముందుగానే తెలుసుకోవటం వలన ముందుగానే చికిత్స జరిపించుకోవచ్చు.

1
క్యాన్సర్ లక్షణాలు
సాధారణంగా క్యాన్సర్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి రకాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు బహిర్గత పరుస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కలిగినపుడు ఇక్కడ తెలిపిన లక్షణాలు బహిర్గతం అవుతాయి.

2
మచ్చలలో మార్పు 
మీ చర్మం పైన ఉండే మచ్చలలో మార్పులు అనగా, వాటి పరిమాణం పెరగటం, రంగులో మార్పు, దురదలు, రక్తస్రావం వంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. కారణం క్యాన్సర్ వ్యాధి కలిగినపుడు మాత్రమె ఇవి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి. మచ్చలలో ఎలాంటి మార్పులు లేదా చర్మం పైన మార్పులు గమినించిన వెంటనే తగిన చర్యలను తీసుకోండి.

3
ట్యూమర్
మీ శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా కనిపించే గడ్డలు కనిపించినట్లయితే అవి క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఈ గడ్డలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి రకాన్ని నిర్ధారిస్తారు. ఇలాంటివి శరీరంలో గుర్తించినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది. గడ్డలను గుర్తించిన తరువాత వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. ఎందుకనగా ఒక క్యాన్సర్ వ్యాధి మాత్రమే శరీరం పైన గడ్డలను ఏర్పరుస్తుంది.

4
విపరీతమైన దగ్గు లేదా గొంతు రావిడి
ఎక్కువగా దగ్గు లేదా గొంతు రావిడి వలన భాదపడుతున్నారా, అయితే ఉపిరితిత్తుల క్యాన్సర్ వలన భాదపడుతున్నారని అర్థం. దగ్గు 3 వారాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడ్ని సంప్రదించటం చాలా మంచిది. దీని వలన కూడా శరీరంలో ఇన్-ఫ్లమేషన్ మరియు ఇన్ఫెక్షన్'లను కలిగిస్తుఉంది.

5
ఆంత్రంలో మార్పులు
మూడు వారాల నుండి ఆంత్రంలో మార్పుల వలన భాదపడుతున్నారా... దీనికి గల కారణం- మీ జీర్ణాశయంలో రక్తస్రావం, కడుపులో నొప్పి, ఆహరం తీసుకోవటంలో ఇబ్బంది, పేగు కదలికలు సరిగా లేకపోవటం, వంటివి సమస్యలు కూడా క్యాన్సర్ బహిర్గత పరిచే లక్షణాలుగా పేర్కొనవచ్చు.

6
వివరించలేని నొప్పి
కొన్ని క్యాన్సర్'లని సులభంగా గుర్తించవచ్చు, బోన్ క్యాన్సర్ వలన కారణం లేకుండా నొప్పి పుడుతుంది. మన వయసు పెరిగిన కొలది నొప్పులు కూడా ఎక్కువ అవుతుంటాయి. కానీ క్యాన్సర్ వలన కలిగే నొప్పిని వైద్యుడికి కూడా సరిగావివరించలేము. ఈ నొప్పి రోజులలో కాకుండా వారాల పాటూ ఉంటుంది.

7
నిరంతరంగా జీర్ణంలో సమస్యలు
అజీర్ణము-అందరిలో కలిగే చాలా సాధారణంగా సమస్య, ఇది క్యాన్సర్ వలన కలుగదు, నిరంతరంగా ఆహార జీర్ణంలో సమస్యలు కలిగితే అది క్యాన్సర్'కి గుర్తు. మీరు ఆహరం మింగేటపుడు మంటగా అనిపించిన అది క్యాన్సర్ వల్లనే అని తెలుసుకోండి. దీనికి కారణం క్యాన్సర్ కణాలు ఆహరవాహికని ప్రమాదానికి గురి చేయటం వలన ఆహరం జీర్ణం అవదు.

8
బరువులో తగ్గుదల
కారణం లేకుండా బరువులో తగ్గుదలను క్యాన్సర్ వ్యాధికి గుర్తుగా చెప్పవచ్చు. ఎలాంటి బరువు తగ్గే వ్యాయామాలు చేయకున్నాను, ఏలాంటి ఆహార నియమాలను పాటించకున్నను బరువు తగ్గుదల అయితే క్యాన్సర్ కారణంగా చెప్పవచ్చు.

9
గుండెలో మంట
ఎక్కువ మొత్తంలో ఆహరం, ఆల్కహాల్ లేదా ఒత్తిడి వలన గుండెలో మంటలు కలుగుతాయి. ఆహరంలో మార్పుల వలన గుండెలో కలిగే మంటను తగించుకోవచ్చు. మార్పులు చేసిన తరువాత కూడా గుండెలో మంట తగ్గకపోతే, క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఇలాంటి విషయాలలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించటం తప్పని సరి.
10
నెలసరి నిలిచాక రక్తస్రావం: నెలసరి నిలిచిన తర్వాత ఎప్పుడో అప్పుడు కొద్దిగా ఎరుపు కనబడటం మామూలే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. కానీ హఠాత్తుగా నెలసరి మాదిరిగా రుతుస్రావం అవుతుంటే.. పైగా పదే పదే వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఇది గర్భాశయ క్యాన్సర్‌ తొలి హెచ్చరిక కావొచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.
11
కడుపుబ్బరం: నెలసరి సమయంలో చాలామంది కడుపుబ్బరంగా ఉందని చెబుతుంటారు. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టేదేమీ కాదు. అయితే ఆ తర్వాత.. మామూలు రోజుల్లోనూ కడుపుబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే నిర్లక్ష్యం తగదు. ఇవి అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్‌ బాధితుల్లో చాలామందిలో కడుపుబ్బరం వంటి సాధారణ లక్షణాలూ కనబడుతుంటాయి.
12
తరచూ జ్వరం: ఎప్పుడో అప్పుడు జ్వరం రావటం, తగ్గిపోవటం మామూలే. అయితే తరచుగా జ్వరం, పులకరం వంటివి కనబడుతుంటే నిర్లక్ష్యం చేయటం తగదు. ఇవి రక్తక్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. రక్తక్యాన్సర్‌ మూలంగా అస్తవ్యస్త తెల్లరక్తకణాలు పుట్టుకొస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తాయి. అందువల్ల జలుబు వంటి లక్షణాలు, జ్వరం విడవకుండా వేధిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid