అన్ని శాస్త్రాల కన్నతల్లి వైద్యం
రుగ్వేదంలో (3500సం. క్రితం) అశ్వినీ దేవతల గురించి ప్రస్తావన నాలుగు సార్లు వస్తుంది. వీరు ఆరోగ్యానికి దేవతలు. వీరు ఆనాటికి ఒక ప్రాచీన తెగకు చెందినవారు.
" మీరు ముసలి వారికి యవ్వనం ఇవ్వగలరు. బాధ లేకుండా కాన్పు చేయగలరు. కాలిన గాయాలకు, క్రూర మృగాలు చేసిన గాయాలను నయం చేయగలరు. మీరు మా కోసం ఔషధాలు తీసుకొస్తారు. సింధు,అశక్ని నదుల్లో సముద్ర గర్భంలో పర్వత సానువుల్లో ఉన్న ఔషధాలు మీకు తెలుసు. మా క్షేమం కోసం వాటిని తీసుకురండి.మా శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో మా వ్యాధులు ఎలా బాగు చేసుకోవాలి నేర్పండి. మా శరీరాల్లోని లోపాలను తొలగించండి"అని అశ్వినీ దేవతలను ప్రార్థించారు.
తర్వాత వచ్చిన యజుర్వేదం స్మృతులు, బ్రాహ్మణాలలో వైద్యం గురించి వైద్యుల గురించి అభిప్రాయాలు మారిపోయాయి.వీటిని ఖండించడం, తిరస్కరించడం జరిగింది
"సామాన్య ప్రజలకు వైద్యం చేసే వాడు అపవిత్రుడు" అని గౌతముడు,మనువు ప్రకటించారు. వైదిక అనుయాయులు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు.స్మృతులు వైద్యశాస్త్రాన్ని తిరస్కరించాయి. వైద్యుల్ని అపవిత్ర అస్పృశ్య వర్గాలతో జత చేశారు. చాకలి కమ్మరి మంగలి వేటగాళ్లు నేరస్తుల జాబితాలోకి వైద్యుల్ని చేర్చినారు.
వైద్యంలో వివిధ రసవాదాలు న్నాయి. ఆ రసమే నాటక సాహిత్య రంగంలో రససిద్దాంతానికి పునాదైంది.
(భాషావరణం నుండి)
(సేకరణ: కుమారస్వామి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి