ఆనందం గురించి అరిస్టాటిల్(క్రీ పూ 384 _447
ఎథిక్స్ లో ఇలా...
మనిషి జీవితంలో పదవి కీర్తి ధనం విజ్ఞానం ఇలాంటివన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వీటి కోసం ప్రాకులాడటం ఏ మేరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. మనిషికి జంతువులకు వృక్షాలకు మధ్య తేడా అల్లా హేతు భావాలు కలిగి ఉండడం .మనసులో రెండు విభాగాలుంటాయి
1 హేతుబద్ధత కలిగి ఉండేది
2 ఆ హేతుబద్ధ ఆదేశాలను పాటించేది.
సహజంగా అదృష్ట దురదృష్టాలు జీవితంపై ప్రభావాన్ని కలిగించేటట్లయితే ఆనందం అనేది స్థిరంగా ఉండదు. కాబట్టి అది కూడా మారిపోతుంటుంది.అప్పుడప్పుడు అదృశ్యమై దుఃఖానికి చోటిస్తుంది. అది నిజమైన ఆనందం కాదు ఆనందంగా ఉండటం సాధ్యమా అంటే సాధ్యమే .దానిని శిక్షణ ద్వారా నిగ్రహం ద్వారా సాధించుకోవాలి .ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమనేది దేవతల లక్షణం .భగవంతుడు ప్రసాదించిన వరం . స్థితప్రజ్ఞుడు కలిసొచ్చిన అదృష్టానికి పొంగిపోడు. వెంటాడే దురదృష్టాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భౌతిక పరమైన జయాపజయాలను అతీతంగా స్థిరమైన ఆనందాన్ని సాధించుకోవాలంటే శీలసంపద అవసరం. శీల సంపద ప్రకృతి సహజంగా ఉండేది కాదు. స్వయం శిక్షణ ద్వారా దాన్ని సాధించుకోవాలి . శీలసంపద మనసుకు సంబంధించింది. ఆనందం కూడా మనసుకు సంబంధించింది .శీలసంపద రెండు మార్గాలు కూడా సంపాదించవచ్చు ఒక మార్గం మేధస్సుకు సంబంధించింది రెండో మార్గం నైతిక పరమైంది. విజ్ఞానం ,గ్రహణ శక్తి సందర్భోచిత నిర్ణయం మొదలైనవి మేధస్సుకు సంబంధించినవి. నిగ్రహం మితంగా ఉండటం మొదలైనవి నైతికపరమైనవి.
(సేకరణ: పిళ్లా విజయ్)
**************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి