డిప్రెషన్
మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్
నన్ను ఒంటరిగా వదిలెయ్, నాతో ఆర్గ్యూ చేయకు, ఇలాంటి పదాలు వాడుతుంటే అది డిప్రెషన్ కి సంకేతాలు అని అంటున్నారు మానసిక వైద్యులు.
గతంలో సంతోషంగా చేసిన పనులు ఇప్పుడు చేయబుద్ధి కాకపోవటం, డిప్రెషన్ లో ఆందోళన కలిగించే లక్షణాలు భయం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం ,శరీరంలో వణుకు,మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం మొదలైనవి ఉంటాయి.
రోగ నిర్ధారణ
వైద్యుడు రోగిని పరీక్షించి కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఎప్పటి నుంచి ఈ మార్పు? ఎంతకాలముంటుంది? ఆల్కహాలు, మత్తుమందు, గుట్కా, సిగరెట్ అలవాట్లు ఉన్నాయా? డిప్రెషన్‌కు మూలకారణమేమిటి? అంశాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు.
డిప్రెషన్‌కు దూరంగా ఉండటమెలా?
స్నేహితులు, హితుల బంధువుల సహాయం తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్ర పోవడం, భోజన వేళలు పాటించాలి.
ప్రాకృతిక ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
మసాలాలు లేకుండా భోజనం చేయాలి.
ధ్యానం, శ్వాసకోశ వ్యాయామాలు చేయండి.
స్నేహితులతో విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి.
పనికిరాని ఆలోచనలు మానండి. ఏదో ఒక పని చేస్తుండాలి.
తోటివారికి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి.
చిన్న పిల్లలకు ట్యూషన్‌లు చెప్పండి.
ట్రాఫిక్‌లో హెల్ప్ చేయండి. బస్‌స్టాప్‌లో ఇతరులకు సహాయ పడండి.
భగవంతుని కార్యక్రమాల్లో చేతనైన సాయం చేయడం, భగవంతుని సేవలో పాల్గొనడం ద్వారా డిప్రెషన్‌ను దూరం చేయవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి