పళ్ళు --బ్రష్షు
నిద్ర లేవగానే ఎవరైనా ముందు చేసేది దంతధావనమే.
అదయ్యాకే మిగిలిన పనులన్నీ. అంతేనా... మాసాచుసెట్స్
విశ్వవిద్యాలయం చేసిన ఓ అధ్యయనంలో అధికశాతం మంది మంచి టూత్ బ్రష్టును వాడటం వల్లే తాము ఆరోగ్యంగా ఉన్నా
మని చెప్పారట. మనిషి పళ్లు తోమడం మొదలు పెట్టింది
ఎప్పుడనేది కచ్చితంగా తెలీకున్నా ఐదు వేల సంవత్సరాల నుంచీ
బ్రష్టులాంటి సాధనం ఉందనేది అర్థమవుతోంది. అయితే అది
ఈనాటి బ్రష్టుల్లా కాకుండా ఓ పుల్ల, పక్షి ఈక, జంతు ఎముక. . .ఇలా విభిన్న రూపాల్లో ఉండేదన్నమాట. నేడు మనం ఉపయోగిస్తోన్న టూత్ బ్రష్ ను తొలిసారిగా 1780లో ఇంగ్లాండకు చెందిన
క్లెర్కెన్ వాల్డ్ కనుగొన్నాడు. అదీ జైల్లో ఉన్న సమయంలోచిన్న
ఎముకకు రంధ్రాలు చేసి అందులో వెంట్రుకలను కుచ్చుల్లా అమర్చి
పళ్లు రుద్దుకున్నాడట. జైలు నుంచి బయటకు వచ్చాక తను కనుగొన్న సాధనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడట. 19వ శతాబ్దం మధ్య వరకూ
కూడా చెక్క లేదా ఎముకలకు రంధ్రాలు చేసి వాటికి జంతువుల వెంట్రుకలను అమర్చి మాత్రమే రుద్దుకునేవారట. 1938లో ఆధునిక బ్రషు పుట్టుకొచ్చింది. మొదట్లో సాదాసీదాగా ఉండేవి కాస్తా మృదువైన
కుచ్చులతోనూ భిన్న ఆకారాల్లోనూ రావడం మొదలైంది. చిన్న పిల్లలు
పట్టుకునేందుకు వీలుగానూ, పెద్ద పిల్లల్ని ఆకట్టుకునేలానూ బొమ్మల్నీ సింగారించు కుంటున్నాయి. నోట్లో పెట్టుకుని బటన్ ప్రెస్ చేస్తే అన్ని వైపులకి వెళ్లి పళ్లను రుద్దే ఎలక్ట్రిక్ బ్రష్టులూ వచ్చాయి. వీటిల్లో కొన్నిపాటలు పాడుతుంటే మరికొన్ని సరిగా బ్రష్టు చేశారో లేదో చెబు తున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు అసలు చేత్తో పట్టుకునే పనిలేనివి వస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి