స్త్రీలు-- స్ట్రెస్
'రెడ్ బుక్' అనే ఆంగ్ల ప్రతిక స్త్రీలు పొందే
స్టెస్ ఎలా వుంటుంది, నిత్యజీవితంలో ఆమె ఎలాంటి
వత్తిళ్ళ కింద ఎక్కువగా నలిగి పోతుంటుంది, ఏ స్ట్రెస్
కు ఆమె స్పందన ఎలా వుంటుంది అన్న విషయమై బోస్టన్ యూనివర్సిటీకి చెందిన Deborah Belle అనే సైకాలజీ ప్రొఫెసర్ ద్వారా విస్తృతమైన పరిధిలో ఒక సర్వేని నిర్వహించారు. సర్వేలో చదువుకున్న స్త్రీలు, చదువుకోని స్త్రీలు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు, ఉద్యోగం చేయక ఇంటినే అంటి పెట్టుకున్న స్త్రీలు, పట్నవాసులు, నగర వాసులు, ఇలా వివిధ వయస్సులకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ విశ్లేషించాక వెళ్ళడైన సర్వే
ఫలితాలు ఇలా ఉన్నాయి.
1. పురుషుల లాగే స్త్రీలు కూడా అన్ని ఒత్తిళ్ళలోకి ముఖ్యంగా ఆర్ధిక వొత్తిళ్ళకు ఎక్కువగా నలిగిపోతుంటారు. స్త్రీ పురుష సంబంధం లేకుండా డబ్బు మనుషుల జీవితాలను శాసిస్తుందనేందుకు ఇదొక ఉదహరణ.
2. స్త్రీ మీద వొత్తిడిని కలిగించే అంశాలలో ఉద్యోగం రెండో స్థానాన్ని ఆక్రమించుతోంది. ఉద్యోగం చేయని స్త్రీలు ఉద్యోగం చేస్తున్న స్త్రీల కంటే అధికంగా డిప్రెషన్‌కి లోనవుతారు.
3.పార్ట్ టైం కింద ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఫుల్ టైమ్ కింద ఉద్యోగం చేస్తున్న స్త్రీలకంటే ఎక్కువ సంతోషంగా వుంటారు.
అంటే సంసారం చేస్తున్న ఒక గృహిణి రెగ్యులర్ ఉద్యోగాన్ని చేయటం కన్నా పార్ట్ టైం ఉద్యోగం చేయటం వల్ల ఎక్కువ సుఖపడుతుందన్న మాట!
అసలు చేయకుండా ఇంట్లోనే వుంటే మాత్రం దుఃఖానికి గురవుతోంది.
4.ఫుల్ టైంకింద ఉద్యోగం చేస్తున్న స్త్రీ ఇంటికోసం వెచ్చించటానికి తనకు టై ముండటం లేదంటూ వాపోతుంటుంది.ఉద్యోగం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో వుండి ఉద్యోగం చేస్తున్న స్త్రీ, ఏదో ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్న స్త్రీ కంటే ఎక్కువ మనో వత్తిడిని పొందుతుందన్నది మరో ఆసక్తికరమైన అంశం.
5 ఇంటి పనుల్లో భర్త సహకరిస్తుంటే ఆ స్త్రీ భర్త పట్లా తన వివాహం పట్ల ఎక్కువ సంతోషంగా సంతృప్తిగా వుంటుంది. భర్త ఎంత పట్టించుకోకుండా వుంటే ఆమె అంత అసంతృప్తితో వత్తిడిని చెందుతుంటుంది.
6.పల్లె ప్రజలు సంతోషంగా ఉంటారని అనుకుంటాం. కాని స్త్రీల విషయంలో ఇది సరికాదు. పల్లెలలో ఉండే స్త్రీలు పట్టణాలలో వుండే స్త్రీలకంటే ఎక్కువ డిప్రెషన్లో వుంటారని తెలుస్తోంది. ఇది అమెరికాకి సంబంధించిన మాట. వీటిని మన స్త్రీలకు అన్వయించాలంటే చిన్న చిన్న పట్టణాలలో వుండే
స్త్రీలు పెద్ద నగరాలలో వుండే స్త్రీల కంటే అసంతృప్తిగా వుంటారని అనుకోవచ్చు. ఈ స్త్రీలలో అసంతృప్తితో పాటు Self Esteem (స్వీయఔన్యత్య భావం)కూడా తక్కువగా వుంటుంది. వివాహం పట్ల వీళ్ళు బాగా అసంతృప్తితో వుంటారు.
7.వివాహంలో సంతృప్తి అనేది స్త్రీల వయస్సును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.
20 నుంచి 29 సంవత్సరాలు మధ్య స్త్రీలలో 34 శాతం మంది వివాహం పట్ల అసంతృప్తి తో వుంటున్నారు. 40 నుంచి 49 మధ్య వయస్సు స్త్రీలలో 28 శాతం మందీ 60 ఏళ్ళు పై బడ్డ స్త్రీలలో 12 శాతం మంది మాత్రమే అసంతృప్తిగా ఉంటున్నారు.
దీనిని బట్టి తక్కువ వయస్సు స్త్రీలు వివాహంలో ఎక్కువ స్ట్రెస్ ను పొందుతుంటారని అనుకోవచ్చు. బహుశ వీళ్ళకు వివాహం పట్ల సరైన అవగాహన,అనుభవం లేక పోవటం వల్ల కావచ్చు.
8.అన్నిట్లోకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తల్లి దండ్రులు, దగ్గరి బంధువులూ తనున్న ఊళ్ళోనో లేక ఆ దగ్గరలోనో వుంటే ఆ స్త్రీ సంతోషంగా సుఖంగా వుంటుందనుకుంటాం గాని అది సరికాదు. సుమారు పది పదిహేను కిలో మీటర్ల పరిధిలో తల్లిదండ్రులు (ముఖ్యంగా బాగా ముసలి వాళ్ళు), మిగతా రక్త సంబంధీకులు వుంటే ఆ స్త్రీ ఎమోషనల్ గానూ, శారీరకంగానూ బాగా స్ట్రెస్ ని
పొందుతుందని తెలుస్తోంది. బహుశా అందుకు కారణం ఆ దగ్గరి బంధువులు ఆమె జీవితాన్ని కంట్రోల్ చేయటానికి ప్రయత్నించటమూ, ఆ గేమ్ లో ఆమె నలిగి పోవటమూ కావచ్చు.అయితే ఈ దగ్గరగా వుండే బంధువుల మూలంగా ఆమెకు అసలు ఉపయోగం వుండదనీ కాదు, ఎమోషనల్ గా ఆమెకు వాళ్ళ నుంచి సహకారం లభిస్తుంది.
9. పసి పిల్లలుండి ఉద్యోగం చేసుకునే స్త్రీ, తన పసిపిల్లల సంరక్షణకు పని మనిషి (ఆయా) ని పెట్టుకోవటం కంటే దగ్గరి బంధువైన వృద్ధ స్త్రీ నెవరినన్నా తెచ్చుకుని వుంచుకున్నపుడు ఎక్కువ స్ట్రెస్ ని పొందుతోందని అర్ధమవుతోంది. బహుశా అందుకు కారణం డబ్బులకు పెట్టుకున్న స్త్రీ విషయంలో తన మాట చెల్లటానికి తన కంట్రోల్ వుండటానికి అవకాశ ముండటం, అదే బంధువును తెచ్చిపెట్టుకున్నప్పుడు తను ఆశించినట్లు పెంచలేక పోవటం, మొహమాటంతో ఆ బంధువునేమీ అనలేక పోవటం, పైగా ఆ బంధువు తను ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు ఫీలవటం, సమయం వచ్చినప్పుడు అలా దెప్పటం వగైరా కారణాలు కావచ్చు.
10. టినేజ్ వయస్సు పిల్లలున్న స్త్రీలు గర్భిణీ స్త్రీల కంటే, ఎనిమిదేళ్ళలోపు వయస్సు పిల్లలున్న స్త్రీల కంటే కూడా ఎక్కువ స్టెసి ని పొందుతుంటారు.
11. తక్కువ చదువుకున్న స్త్రీలు విద్యావంతులైన స్త్రీలకంటే అధికంగా స్ట్రెస్ పొందుతుంటారు. అంటే జీవితం లో వివిధ రకాల స్ట్రెస్ ని తగ్గించుకోవటానికి స్త్రీకి విద్య కూడా ఒక ఉపకరం అవుతుందన్న మాట!
12.నేరాలు, అలజడి, అధికంగా ఉండే ప్రదేశాలలో నివసించే స్త్రీ ప్రశాంత ప్రదేశాలలో నివసించే స్త్రీ కంటే అధికంగా స్ట్రెస్ ని పొందుతుంది.
13.మన జీవితంలోకి స్టెస్ నింపే అంశాలలో మన చుట్టూ వుండే సమాజంలోని నేర ప్రవృత్తి, అలజడి కూడా ఒకటి.
*స్ట్రెస్ తగ్గించుకోవటానికి స్త్రీలకు కొన్ని సూచనలు*
> ఇంటి పనుల్లో సహకరించమని మీ భర్తను అర్ధించండి. అతను అందుకు వీలు కాదంటే మీరు సుఖంగా పని చేసుకోవటానికి వీలుగా సౌకర్యాలను (వాషింగ్ మెషీన్, గీజర్ వగైరాలు) కన్పించ మనండి.
>మీ పాప/బాబు ను సాకటానికి దగ్గరి బంధువు ను తెచ్చు
ఆమె మూలంగా మీకు ఇబ్బంది కలుగుతోంటే ఆమెను తిరిగి పంపేయటానికి, పని మనిషి/ఆయాని కుదుర్చుకోవటానికి సందేహించకండి.
> మీరు చేస్తున్న ఉద్యోగం మీకు అసౌకర్యంగా, ముళ్ళబాట లా ఉంటే మరో ఉద్యోగాన్ని చూసుకోవటానికి సందేహించకండి. అందుకోసం తగు ప్రయత్నాలను వెంటనే ప్రారంభించండి.
> మీ కాలాన్ని, శక్తిని తినేయటానికి చూసే స్నేహితులు, బంధువులతో 'నో' అని చెప్పటానికి సందేహించకండి.
> భవిష్యత్తుపట్ల ఆశను చంపుకోకండి. మీరిప్పుడు ఇబ్బందులలో, కష్టాలలో వుంటే త్వరలోనే అవి తొలగిపోతాయనే ఆశాభావాన్ని విడనాడకండి.
> మీకు ఇష్టంగా వుండే ఆసక్తులు, హాబీలను చంపుకోవద్దు. మీ మానసిక ఆరోగ్యానికి అవి చాలా అవసరం.మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మంచి ఆహారాన్నితీసుకోండి. సరిపడా రెస్ట్ తీసుకోండి. క్రమబద్ధంగా రోజూ ఎక్సర్ సైజులు చేయండి. మీరు ఎంత ఆరోగ్యంగా వుంటే అంతగా స్ట్రెస్ ని తట్టుకో గలుగుతారు.
> మీ భర్త, పిల్లలు, మిమల్ని ప్రేమించాలి. ప్రేమించటం వాళ్ళ ధర్మం అని అనుకోవద్దు. ముందు మీరు కూడా వాళ్ళ పట్ల మీరు కోరుకుంటున్న విధంగా ప్రేమను ప్రదర్శించండి.
మీ తలకు మించిన పనుల్ని నెత్తిన వేసుకోవద్దు మీరేమీ సూపర్ వుమన్ కాదు. మీ పరిధిలో, మీరు చేయగలిగినంత పనిని మాత్రమే; చేయగలరు. దీనిని దృష్టిలో వుంచుకుని ముందుకు అడుగు వేయండి.
__ పిళ్లా కుమారస్వామి
(రిలాక్స్,రిలాక్స్ ఆధారంగా)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి