వజ్రం లాంటి జీవితం

 

ఎవరికైనా ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఈ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అవి ఏమంటే
శారీరక ఆరోగ్యం :
         మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకుని రోజూ వ్యాయామం చేయాలి. దేహమే దేవాలయం ,ఆహారమే ఔషధం. ఈ సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

మానసిక ఆరోగ్యం:
           మంచి పుస్తకాలను రోజూ చదువుతూ ఉండాలి. ఉన్నత వ్యక్తిత్వం గల వారిని కలుస్తూ వారి పరిచయాలను పెంచుకోవాలి. మంచి మిత్రుల స్నేహం చేస్తూ ఉండాలి. మానసిక కాలుష్యం కాలకూట విషం కన్నా ప్రమాదకరమైనది.

ఉద్వేగ ఆరోగ్యం:

           వివిధ భావాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. స్వీకరించిన భావాలను వ్యక్తీకరించాలి. రోజూ ఎదురయ్యే అనేక ఉద్వేగాలను తట్టుకుని నిలబడగలగడం చాలా ముఖ్యం ఇదే ఉద్వేగ ఆరోగ్యానికి చిహ్నం.
                                                  
___పిళ్లా కుమారస్వామి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid