కరోనా వైరస్ కు వైద్యం

కరోనా వైరస్ కు వైద్యం లేదు. యాంటీబయాటిక్ కనుక్కో లేదు. రాకుండా ఉండాలన్నా వచ్చినా నయం కావాలన్నా
వ్యాధి నిరోధక శక్తి(immunity) శరీరంలో ఉండాలి.
Immunity శరీరంలో పెరగాలంటే
1) రోజు వ్యాయామం చేయాలి
2) నీళ్లు కనీసం 5లేదా6 లీటర్లు తప్పనిసరిగా తాగాలి
3) శీతల పదార్థాలు (cold items) తీసుకోరాదు
4) మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా  విటమిన్ సి (పుల్లటి పదార్థాలు) ఉండేటట్లు చూడాలి. లెమన్ రైస్ టమోటా చారు లేదా చింతపండు చారు తప్పనిసరిగా తీసుకోవాలి. రసంలో వెల్లుల్లి (తెల్లగడ్డలు)ఎక్కువగా వేసుకోవాలి
5) విటమిన్ డీ కి కూడా వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణం ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదయం ఎండలో గాని సాయంత్రం ఎండలో గాని కాసేపు తిరిగితే విటమిన్ డి లభిస్తుంది.
6) రోగానికి ఔషధం వాడడం కన్నా రోగ నివారణే మిన్న అన్న సూత్రాన్ని పాటించాలి
7) శారీరక శుభ్రతతో పాటు
ఆహార శుభ్రత కూడా ముఖ్యం. బయట తినుబండారాలను తినడం మానేయాలి. ఇంట్లో వేడి వేడి గా చేసుకుని తినాలి. జంక్ ఫుడ్స్ మానేసి శరీరానికి పోషకాలు అందించే ఆహారాన్ని ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు విరివిగా వాడాలి
8) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జలుబు దగ్గు జ్వరం వంటివి వస్తే తక్షణం వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid