ఆరోగ్య నియమాలు
ఆరోగ్య నియమాలు
1. ఉదయం 5 గం.లకు నిద్ర లేవాలి. అరగంటసేపు వాకింగ్ లాంటి వ్యాయామాలు
చేయాలి. 2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. మలవిసర్జనకు వెళ్లినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటి నుంచి వచ్చినప్పుడల్లా చేతులను, కాళ్ళను సబ్బుతో శుభ్రపరచుకోవాలి. ఆహారం తీసుకొనే ముందర చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రపరచుకోవాలి.
4. ఉదయం టిఫిన్ 8.30 గం॥ నుండి 9గం. లోపు తినాలి.
5. ఉదయం టిఫిన్ పండ్లరసం తాగడం మంచిది.
6. మధ్యాహ్నంలోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి.
7. మంచి నీళ్ళు భోజనానికి 30 ని॥ ముందు త్రాగాలి. ఒక పండు తినాలి.
8. వండిన ఆహారం 40 నిమిషాల లోపు తినాలి. భోజనం అయ్యాక అరగంట తరువాత నీళ్లు తాగాలి. 60 ఏండ్లు దాటినవారు భోజనం చేసిన వెంటనే పది నిమిషాలు దాటాక లేయాలి.
9. ఆహారం బాగా నమిలి మ్రింగాలి. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. వేసవిలో మజ్జిగ త్రాగాలి. భోజనం తర్వాత 15నిమిషాలు విశ్రాంతి (nap) తీసుకోవడం మంచిది.
10. రాత్రి భోజనం 7గం. లోపు చేయాలి. రాత్రి పూట తక్కువగా తినాలి.
11. రాత్రి భోజనం తర్వాత 1కి.మీ నడవాలి
12. రాత్రి పూట లస్సీ, పుల్లటి పండ్లు తీసుకోకపోవడం ఉత్తమం.
13. రాత్రి నిద్రపోయే కాలం కనీసం 7 నుండి 8 గంటలు వుండాలి.
14. పంచదార, మైదా, ఉప్పు తక్కువ వాడాలి. 15. ఫ్రిజ్లో తీసినవి గంట తర్వాత తినాలి.
16. కూల్డ్రింక్స్, టీ,కాఫీ, ఐస్క్రీమ్లు మితంగా తీసుకోవడం సరైనది.
17. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది.
18. రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.
19. చేతి, కాలిగోర్లను తరచూ కత్తిరించుకోవడం శ్రేయస్కరం. లేకపోతే మలినాలు పేరుకొని ఫంగస్ చేరుతుంది.
____ కుమారస్వామి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి