హైబీపీ తగ్గాలంటే..
![హైబీపీ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే హైబీపీ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే](https://www.ntnews.com/images/health-images/2020/10/06/Health-BP_1601985854.jpg)
* దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.
* అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.
* యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
* వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి