పీచు పదార్ధం(ఫైబర్)


        మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను (క్యారెట్, బీట్ రూట్, దోసకాయ, ఇతర పళ్లు) తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్ ను నివారించినట్లవుతుంది. ప్రతిరోజూ మనం10గ్రాముల పీచు ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి.

ఫైబర్లు ఐదు రకాల ఆహారపదార్థాలలో లభిస్తుంది.
అవి:
      * కాయగూరలు.
      * గింజ ధాన్యాలు.
      * నట్స్ మరియు సీడ్స్.
      * బీన్స్ మరియు లెగూమ్స్.
      * తాజా,ఎండిన పండ్లు.

పదార్థాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు: 
    1.  కరిగే ఫైబర్(పీచు)
    2. కరగని ఫైబర్(పీచు)

1.కరిగే పీచు :
           ఇది బ్లడ్ కొలెస్టెరాల్ ను తగ్గిస్తుంది.దాంతో
గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ వుతుంది.  ఇవి గ్లూకోజ్ రక్తంలో కలవడాన్ని  నెమ్మది చేస్తుంది. అందువల్ల రక్తము లో సుగరు లెవల్ తగ్గుతుంది.

ఈ ఫైబర్ దొరికే పదార్థాలు:

* ఓట్స్

* ఓట్స్ తవుడు

* బార్లీ

* బ్రౌన్ రైస్

* చిక్కుడు

* పండ్లు , కాయకూరలు.ఉదా: యాపిల్, ఆరెంజ్  
   కారెట్స్ మొదలైనవి.
* బియ్యం, గోధుమ,జొన్న, పప్పులు, ఓట్స్ వంటి వాటిలో పీచు అధికంగా ఉంటుంది.అయితే తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి.బ్రౌన్ రైస్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.

*బీన్స్ అనేది పీచు అధికంగా ఉన్న ఆహారం.వీటిని వండిన తర్వాత కూడా పీచు అధిక మొత్తంలో ఉంటుంది. ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ వీటిని అయినా తినవచ్చు. గోంగూర, బచ్చలి, మెంతి, తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో భాగంగా ఆకుకూరలను చేసుకోవచ్చు.


2.కరగని పీచు  : 

      దీనినే రఫేజ్ అని కూడా అంటారు.కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది.విరోచనం సాఫీ గా జరుగుతుంది.
      ఇవి లభించే పదార్థాలు:

* తొక్క తీయని దాన్యాలు. ఉదా:అన్ని రకాల
 అపరాలు ( పెసలు , ఉలవలు,మొదలైనవి)

* కాయ ధాన్యాలు సైజులో చిన్నవైనప్పటికి అధిక  పీచును కలిగి ఉంటాయి.కొద్దిగా తిన్నా వాటిలో వున్న కొవ్వు, ప్రొటీన్లు అధిక శక్తి నిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తినండి.

* పండ్లు,కాయల తొక్కలు.
* చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగాఉంటాయని భావిస్తారు. కానీ బెర్రీ పండ్లలో పీచు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ట్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి బాగా తినండి.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid