చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా.. వీటిని తినండి..
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhOK_A8HDEmYMI9TUm2VNaaK8Znd43y8uva_lzrtv3el4bJYaRRoCYear9ovDWbeIG1rBhmEmW3GdM7yi57a0MAXvXsA5ya9QkjALoXy4h87okaD16B8pPlUiGJpJYI_hPL1vzG7gImlHIT/s1600/1623398991320178-0.png)
pc: samayam telugu.com శరీరం పనితీరు చక్కగా ఉండాలంటే వివిధ రకాల మాక్రో న్యూట్రియెంట్స్, మైక్రో న్యూట్రియెంట్స్ కావాలి. వాటిలో విటమిన్ బీ 12 కూడా ఒకటి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది బాడీ చేసే రోజువారీ పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ శరీరానికి తగినంత బీ 12 లభించకపోతే అది కొన్ని విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అయితే, ఈ విటమిన్ డెఫిషియెన్సీ అంత త్వరగా బయటపడదు. దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. లేకపోతే, కాగినిటివ్ డిక్లైన్, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు రావచ్చు. భారతీయుల ఆహారపు అలవాట్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే అయినా వివిధ కారణాల వల్ల కొన్ని కామన్ డెఫిషియెన్సీలు కనబడతాయి. విటమిన్ ఏ, విటమిన్ డీ, ఐరన్, అయోడిన్ డెఫిషియెన్సీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎక్కువమందికి తెలిసినవి కూడా ఇవి. అంతే ముఖ్యమైనది కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోనిది, చాలా మందికి తెలియనిది బీ 12 గురించి. సుమారుగా 74% ఇండియన్లకి విటమిన్ బీ 12 డిఫిషియెన్సీ ఉంది. ఈ విటమిన్ గురించి.. విటమిన్ బీ 12 ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. కానీ, ఇ...