చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా.. వీటిని తినండి..
శరీరం పనితీరు చక్కగా ఉండాలంటే వివిధ రకాల మాక్రో న్యూట్రియెంట్స్, మైక్రో న్యూట్రియెంట్స్ కావాలి. వాటిలో విటమిన్ బీ 12 కూడా ఒకటి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది బాడీ చేసే రోజువారీ పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ శరీరానికి తగినంత బీ 12 లభించకపోతే అది కొన్ని విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అయితే, ఈ విటమిన్ డెఫిషియెన్సీ అంత త్వరగా బయటపడదు. దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. లేకపోతే, కాగినిటివ్ డిక్లైన్, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు రావచ్చు.
భారతీయుల ఆహారపు అలవాట్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే అయినా వివిధ కారణాల వల్ల కొన్ని కామన్ డెఫిషియెన్సీలు కనబడతాయి. విటమిన్ ఏ, విటమిన్ డీ, ఐరన్, అయోడిన్ డెఫిషియెన్సీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎక్కువమందికి తెలిసినవి కూడా ఇవి. అంతే ముఖ్యమైనది కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోనిది, చాలా మందికి తెలియనిది బీ 12 గురించి. సుమారుగా 74% ఇండియన్లకి విటమిన్ బీ 12 డిఫిషియెన్సీ ఉంది.
ఈ విటమిన్ గురించి..
విటమిన్ బీ 12 ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. కానీ, ఇది శరీరం తనకి తాను తయారు చేసుకోలేదు. బ్రెయిన్ హెల్త్, నెర్వ్ టిష్యూ హెల్త్, రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ వంటి పనులు బీ 12 తో ముడిపడి ఉంటాయి. బాడీలో ప్రతి సెల్ యొక్క మెటబాలిజం ఈ విటమిన్ మీదే డిపెండ్ అయి ఉంది. ఈ విటమిన్ ఫోలిక్ యాసిడ్ ని అబ్జార్బ్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటెయిన్ చేస్తుంది.
Also Read : అమ్మాయిలు ఈ వయసులో రజస్వల అయితే మంచిది కాదట..
విటమిన్ బీ 12 ప్రాముఖ్యత..
-12-
1. రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మ్ అవుతాయి.
2. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి.
3. అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది.
4. కాగ్నిటివ్ కెపాసిటీ పెరుగుతుంది.
5. డిప్రెషన్ దరి చేరదు.
6. బ్రెయిన్ డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
7. కంటి ఆరోగ్యానికి మంచిది.
8. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
9. హెల్దీ స్కిన్, హెయిర్, నెయిల్స్‌కి అవసరం.
10. పుట్టుకతో వచ్చే లోపాలని ప్రివెంట్ చేయగలదు.
ఈ విటమిన్ తక్కువగా ఉంటే..
బీ 12 తక్కువగా ఉన్నప్పుడు కనపడే కామన్ సింప్టమ్ స్కిన్ పాలిపోయినట్లుగా ఉండడం, పసుపు రంగులో ఉండడం. దీనితో పాటు నిస్త్రాణ, డిప్రెషన్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, కన్‌ఫ్యూజన్ వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఆకలి ఉండదు, కాన్స్టిపేషన్ కూడా ఉండవచ్చు. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం, ఎనీమియా ఇతర లక్షణాలు. అందుకే, ఫుడ్ ద్వారా ఈ విటమిన్‌ని తీసుకోవడం అత్యవసరం.
Also Read : ఈ లక్షణాలు ఉంటే మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లేనట..
విటమిన్ బీ 12 ఎలా లభిస్తుంది..
-12-
ఈ విటమిన్ పాలు, పాల పదార్ధాలు, చేపలు, ఎగ్స్, మీట్ లో ఉంటుంది. వెజిటేరియన్స్‌కి కావాల్సినంతగా ఈ విటమిన్ తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, వేగన్స్‌కి ఇంకా సమస్యగా ఉంటుంది. అయితే, ఈ విటమిన్ సప్లిమెంట్స్ రూపంలో లభిచినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పైగా వేగన్ సప్లిమెంట్స్ చాలా తక్కువగా లభిస్తాయి. బ్లోటింగ్, కడుపు నిండుగా ఉండడం, గ్యాస్ట్రిక్ డిస్‌కంఫర్ట్ వంటివి ఈ సైడ్ ఎఫెక్ట్స్‌లో ఉంటాయి.
చివరిగా..
సరైన సోర్సుల ద్వారా ఈ విటమిన్ మీ బాడీలోకి వెళ్ళడం ఇంపార్టెంట్. రోజు వారీ ఆహారంలో ఈ విటమిన్ ఉండడం చాలా అవసరం.
Ravula Amala | Samayam (Telugu 07 Jun 2021)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి