గుడ్డుతో గుడ్ కొలెస్ట్రాల్! గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాల క్రితం గుడ్డులో ఉండే కొలస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలామందిలో ఉండేది. కానీ ఒక పెద్దగుడ్డులో 180 నుండి 186 మిల్లీగ్రాముల కొలస్ట్రాల్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కొలస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయం కొలస్ట్రాల్ను తగ్గించడంలో అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటుంది. అంటే రోజుకు మూడుగుడ్లు తిన్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదన్నమాట. కాబట్టి, రెగ్యులర్ డైట్లో గుడ్డు చేర్చుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు. మంచి కొలెస్ట్రాల్ను అందిస్తుంది. ఒక గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లేవిన్ ఫాల్లాట్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, ఇతర న్యూట్రిషియన్స్ అధికంగా ఉన్నాయి. గుడ్డులో ఉండే హై డెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్ డీ ఎల్) శరీరం, బ్రెయిన్కు చాలా అవసరం. హెచ్ డీ ఎల్ శరీరంలో ప్రతి సెల్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్,కార్టిసోల్ ఉత్పత్తికి సహాయపడు...
పోస్ట్‌లు
ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
*మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.* ఈరోజుల్లో నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అతిగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంతమందికి వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మాంసాహారం ఉండాలి. స్విగ్గిలు, జోమాటోలు వచ్చిన తర్వాత మాంసాహారం వినియోగం మరింత పెరిగింది. అయితే అతిగా మాంసాహారం తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసాహారం వల్లే ఎక్కువ మందికి క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె జబ్బుకి అతి సమీపంలో ఉన్నారని అర్థం. అలాగే మాంసాహారాన్ని ప్రతిరోజు తీసుకున్నవారు బరువు త్వరగా పెరుగుతారని డాక్టర్లు ఎప్పటినుంచో చెపుతున్న వాస్తవం. అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కు...