మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.
*మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.*
ఈరోజుల్లో నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అతిగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంతమందికి వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మాంసాహారం ఉండాలి. స్విగ్గిలు, జోమాటోలు వచ్చిన తర్వాత మాంసాహారం వినియోగం మరింత పెరిగింది. అయితే అతిగా మాంసాహారం తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మాంసాహారం వల్లే ఎక్కువ మందికి క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె జబ్బుకి అతి సమీపంలో ఉన్నారని అర్థం.
అలాగే మాంసాహారాన్ని ప్రతిరోజు తీసుకున్నవారు బరువు త్వరగా పెరుగుతారని డాక్టర్లు ఎప్పటినుంచో చెపుతున్న వాస్తవం. అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన మాంసాహారం తినడం వల్ల వచ్చే పోషకాలు లభిస్తాయి. అదే సమయంలో బరువుని కూడా తగ్గిస్తాయి.
అలాగే మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం దీనివల్ల ఆ పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తాయి. అలాగే మాంసాహారం ఎక్కువ తిన్నవారిలో వచ్చే చెమట వాసన చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటుంది.
అలాగే ఎక్కువ మాంసాహారం తింటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నట్లే దీనివలన మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే మాంసంలో కరిగే ఫైబర్ ఉండదు. కాబట్టి జీర్ణవ్యవస్థ కదలకుండా మలబద్ధకానికి కారణం అవుతుంది.
నిజానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ లు రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. అలాఅని అతిగా మాంసాహారం తింటే మాత్రం శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవద్దు అనట్లేదు కానీ పరిమితిలో మాత్రమే తీసుకోమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి