గుడ్డుతో గుడ్ కొలెస్ట్రాల్!
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాల క్రితం గుడ్డులో ఉండే కొలస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలామందిలో ఉండేది. కానీ ఒక పెద్దగుడ్డులో 180 నుండి 186 మిల్లీగ్రాముల కొలస్ట్రాల్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు.
కొలస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయం కొలస్ట్రాల్ను తగ్గించడంలో అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటుంది. అంటే రోజుకు మూడుగుడ్లు తిన్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదన్నమాట. కాబట్టి, రెగ్యులర్ డైట్లో గుడ్డు చేర్చుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు.
మంచి కొలెస్ట్రాల్ను అందిస్తుంది.
ఒక గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లేవిన్ ఫాల్లాట్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, ఇతర న్యూట్రిషియన్స్ అధికంగా ఉన్నాయి. గుడ్డులో ఉండే హై డెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్ డీ ఎల్) శరీరం, బ్రెయిన్కు చాలా అవసరం. హెచ్ డీ ఎల్ శరీరంలో ప్రతి సెల్ స్థిరంగా ఉండటానికి
సహాయపడుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్,కార్టిసోల్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కోలిన్ను ఉత్పత్తి చేస్తుంది. గుడ్డులో కోలిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తుంది. మెమొరీ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. రోజూ మూడు గుడ్లు తింటే వ్యత్యాసం కచ్ఛితంగా గుర్తించవచ్చు.
కంటిచూపును మెరుగుపరుస్తుంది
గుడ్డులో ఉండే లూటిన్ జియాక్సిథిన్, కెరోటినాయిడ్ విటమిన్స్ కంటిచూపును మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఇంకా ఇది వయస్సుకు సంబంధించిన మాస్కులర్ డీజనరేషన్ రిస్క్ ను తగ్గించి, వయస్సు పెరిగేకొద్దీ వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది.
కండరాలకు శక్తినిస్తుంది
రెండు గుడ్లు తినడం వల్ల ఒక సర్వింగ్ మాంసం తిన్నంత ప్రోటీన్ పొందవచ్చు. రెగ్యులర్ డైట్లో ఎగ్ వైట్ చేర్చుకోవడం వల్ల కండరాలు గట్టిగా తయారవుతాయి. కాబట్టి రోజుకు మూడు గుడ్లు తినడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు..
ఎముకలను గట్టిపరుస్తుంది
గుడ్డులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి కంటెంట్ శరీరం ఎదుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ డి శరీరంలో క్యాల్షియాన్ని గ్రహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇవి శరీరంలో ఎముకలను గట్టిగా ఉంచడానికి దోహదపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
గుడ్డును రోజూ అల్పాహారంతో తీసుకోవడం వల్ల రోజు మొత్తంలో ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు తగ్గుతారు.
ఇటీవల నిపుణులు జరిపిన పరిశోధనల ప్రకారం తక్కువ కార్బోహైడ్రేట్ డైటు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెనొప్పి బారినపడకుండా ఉండవచ్చు. గుడ్డులో శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అమినోయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి గుడ్డులో ఉండే పూర్తి పోషకాలు శరీరానికి అందేలా చేస్తాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి