పోస్ట్‌లు

SOUR SPINACH / గోంగూర

ఆకు కూర‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. ఈ ఆకు కూర గురించి తెలియ‌ని వారుండ‌రు.        గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డిని, ప‌ప్పును, గోంగూర పులిహోర‌ను, గోంగూర మ‌ట‌న్, గోంగూర చికెన్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర ప‌చ్చ‌డిలో ప‌చ్చి ఉల్లిపాయ‌ను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. *_🍃గోంగూర ఆకుల‌ (Sorrel Leaves)తోనే కాకుండా గోంగూర కాయ‌ల మీద ఉండే పొట్టుతో కూడా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. గోంగూర ఆకుల‌తోపాటు కాయ‌లు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. గోంగూరను పంట‌గా వేసి వాటి నుంచి నారను తీసి సంచుల‌ను త‌యారు చేస్తుంటారు. మ‌న‌కు తెల్ల గోంగూర‌, ఎర్ర గోంగూర వంటి రెండు ర‌కాల గోంగూర‌లు ల‌భిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూర‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకుల‌కు ఆముదాన్ని రాసి వేడి చేసి గ‌డ్డ‌ల‌పై క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల అవి త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి._🍃* *_🍃గోం...

మధుమేహం - జాగ్రత్తలు

1) బరువును అదుపులో ఉంచుకోండి ఊబకాయలు అయన మధుమేహ వ్యాధిగ్రస్లు బరవును ఎప్పటి కప్పుడు చూసుకోవాలి. టైపు -2 మధుమేహులలో అధిక బరువు ఉండటం అత్యంత ప్రమాదకరం. బరువు 20 శాతం పెరుగుతున్న కొద్ది మధుమేహ సమస్య రెట్టింపు అవుతున్నట్లుగా భావించాలి. వారు 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహం అదుపులో ఉన్నట్లే . కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం , బరువును తగ్గించుకోవటంలో ఆ తగ్గిన బరువును కోనసాగించడంలో తోడ్పడతాయి. 2) చురుకైన జీవన శైలి మధుమేహులు మందగొడిగ ఉంటే అది ఇంక పెరుగుతూ ఉంటుంది . చురుకుగా పని చేయడం వల్ల శరీరం కూడా హార్మోన్ నుతగువిధంగా వినియోగించి, చురుకుదనాన్ని పెంచుకోగలుగుతుంది . రోజు అరగంట వ్యాయామం చేస్తే మధుమేహం వలన సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు . వ్యాయామం ద్యారా ఇన్సులిన్ యొక్క పని విధానం మెరుగై కణజాలంలోకి చక్కెర గ్రహించబడుతుంది. 45 సం" ఫై బడిన ప్రతిఒక్కరూ, మధుమేహం వచ్చే అవకాశాలు కలిగిన యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ అని పరిశోధనలో తెలుపుతున్నాయి. 3) ఎర్ర మాంసం, అవయవమాంసం, హలిమ్ వంటి మాంసపు వంటకాలు నియంత్రించాలి వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ...

lung cancer symptoms

ముఖ భాగంలో లంగ్ కేన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..!    ap7am.com,     31-05-2022 Tue 13:05 చెవి వెనుక భాగంలో నొప్పి కొన్ని సందర్భాల్లో దవడ భాగానికీ విస్తరణ ముఖంపై వాపులు, నొప్పి ఊపిరితిత్తుల చుట్టూ నీరు వెన్ను నొప్పి కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే నిశ్శబ్దంగా ప్రాణాలను కబళించే కేన్సర్ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా ఒక సంక్షోభంగా మన మధ్యే కొనసాగుతోంది. ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతుండడం ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అంశం. కేన్సర్లలో నూ లంగ్ కేన్సర్ కు సంబంధించి లక్షణాలు పెద్దగా తెలియవు. ముందుగా గుర్తిస్తేనే ఈ మహమ్మారి ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు.  కేన్సర్ తొలి నాళ్లలో గుర్తించడం కష్టం. కేన్సర్ కణాలు మరింత పెరిగిపోయి, విస్తరించిన తర్వాతే ప్రభావాలు బయటకు కనిపిస్తుంటాయి. అప్పటికే అది మూడు, లేదంటే నాలుగో దశకు చేరిపోయి ఉంటుంది. దాంతో ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే, లంగ్ కేన్సర్ లో కొన్ని లక్షణాలు ముఖ భాగంలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా నొప్పితో బాధపడడం కేన్సర్ లక్షణాల్లో ఒకటి. చెవి వెనుక భాగంలో టెంపోరియల్ రీజియన్ లో నొప్పి వస్తుంటుంది. అక్కడి నుంచి ద...

బొజ్జ రాకుండా ఉండాలంటే..!

ముప్ఫయ్యేళ్ల వయస్సు దాటిన తరువాత బొజ్జ రావడం సహజంగా కనిపిస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బొజ్జ రాదని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో అతి ముఖ్యమైనది ప్లేటు పరిమాణం. పెద్ద ప్లేటులో అన్నం తిన్నప్పుడు చాలా ఎక్కువగా తింటాం. అలా ఆకుండా, చిన్న ప్లేటులో అన్నం తింటే తక్కువ పరిమాణంలో తింటాం. ఇదేకాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం. - బాగా పొద్దు పోయాకా భోజనం చేయకూడదు. మరీ ఆకలిగా ఉంటే పండ్లు కాని, స్నాక్స్ కాని తినడం మంచిది. - భోజనం చేసిన సమయానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి.. - భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. దీనికి దూరంగా ఉండాలి. కొంతమంది విచారంలో ఉన్నప్పుడు కాని, సంతోషంగా ఉన్నప్పుడు కాని, కోపంగా ఉన్నప్పుడు కాని ఎప్పుడూ తినే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు. దీనికి దూరంగా ఉండాలి. భావోద్వేగాలకు గురైనప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఉత్తమం. - నిద్రలేమి లేదా తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యల వల్ల కూడా బొజ్జ పెరిగే అవకాశాలున్నాయి. కనుక తగిన స్థాయిలో నిద్రపోవాలి.

ఎక్మో చికిత్స అంటే ?

బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా  చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు)     *ఎక్మో*  ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).                    *ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో* *ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో  ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి... ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున...

ప్రశాంతమైన వృధ్ధాప్య జీవనం గడిపేందుకు ..

1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి.. ✊లేదా మీకు సౌకర్యం అనిపించిన చిన్న ఇంట్లో హాయిగా గడపండి ! 2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు  స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. ✍ 3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.  🤔 4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...🤓 5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..😞 6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.🤗  7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి... 👐👐  8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వ...

డెంగీ_నివారణకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు

*            దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.     * హఠాత్తుగా తీవ్రజ్వరం  * తీవ్రమైన తలనొప్పి  * కళ్ల వెనుక నుంచి నొప్పి     *ఒళ్లు-కీళ్ల నొప్పులు* వాంతి వికారం  * ఆకలి లేకపోవటం     ... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.    ఈ దోమ చాలా స్పెషల్‌!     ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్‌ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా ...