Secret of Happiness.
*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.* *మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ.* *"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.* *ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?* *"ఎందుకు అలా అనిపిస్తోంది?" అని అడిగాను.* *"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని.. కానీ నాకు ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు.* *అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.* *ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదుకానీ నేను కూడా సంతోషంగా లేను.* *వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు.* *చివరికి ఒక ఎండోక్రినాలోజిస్ట్ డాక్టరు మితృడు చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది.* *ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది.* _*మీ కోసం ఆ వివరాలు :*_ *మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు.* *1. ఎండార్ఫిన్స్.. Endorphins,* *2....