గ్యాస్ సమస్యకు చెక్


         pic source: dlf.pt


కొబ్బరి నీళ్లు : గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మంచిది

కొత్తిమీర అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పని చేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు

వెల్లుల్లి : గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని  నమలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, ధనియాలు, జీలకర్ర  తీసుకుని ఐదు నిమిషాలపాటు నీళ్లలో ఉడికించాలి. ఈ హెర్తాబల్ టీ తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూసు తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య పోతుంది


ఇంగువ : ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్తి తగ్గిపోతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

మెనోపాస్/ఆండ్రోపాస్