ఆరోగ్య జీవనం గడపడానికి పది మౌలిక సూత్రాలు
1. రోజూ కావలసినంత విశ్రాంతి తీసుకోవాలి.
ప్రతిరోజు సుమారు 7 నుండి 8 గంటల సేపు
నిద్ర పోవాలి. అప్పుడే ఎక్కువకాలం
ఆరోగ్యంగా జీవించగలరు.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట నుండి
గంట సేపు వ్యాయామం చేయాలి.ఇందులో కనీసం పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేయాలి. 15 నిమిషాలు ధ్యానం చేయాలి. తక్కిన కాలంలో శారీరక వ్యాయామం చేయాలి.
3. మొక్కల నుండి లభించే ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. సోయా, చిక్కుళ్ళు, డ్రై ఫ్రూట్స్, పచ్చిబఠాణీలు మొదలైన వాటిలో ప్రొటీన్లు లభిస్తాయి.
4. తరచుగా తృణధాన్యాలు ముఖ్యంగా పెసలు రాగులు జొన్నలు సజ్జలు ఉలవలు మొదలైనవి తప్పనిసరిగా ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి.
5. ఆరోగ్యకరమైన మంచి కొవ్వు పదార్థాలను తరచూ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, అవిసె గింజలు, వాల్ నట్స్ మొదలైనవి తీసుకోవాలి.
6. బరువు పెరగకుండా చూసుకోవాలి.
బిఎంఐ 25 ఉండటం సరైనది.ఇది 30 కన్నా ఎక్కువ అయితే అధికబరువు ఉన్నట్లు.
నడుము కొలత మగవారికి 40", స్త్రీలకు 37" కన్నా మించితే గుండెపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
7. మద్యం నుంచి మత్తు పదార్థాలు డ్రగ్స్ నుంచి క్యాన్సర్ను కలిగించే పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు గుట్కా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
8. జీవితం పట్ల ఆశావహ దృక్పథం కలిగి ఉండాలి.
ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
9. కుటుంబంతో, స్నేహితులతో కలిసి సంతోషంగా రోజులో కొంత సమయాన్ని గడపాలి.
10. రోజులో కొంత సమయాన్ని మానసిక దృఢత్వం ని పెంచడానికి పుస్తకాలను చదవాలి ధ్యానం చేయాలి. మైత్రి భావనను పంచుకోవడానికి ప్రపంచంలో అందరూ బాగుండాలని సానుకూల దృక్పథంతో కోరుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి