సపోటా పండు తింటే ఎన్ని లాభాలో






కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతో మందిని బలి తీసుకుటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ వల్ల చాలా మందిని వివిధ లక్షణాలు వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, కొద్దిగా జ్వరం, దగ్గు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి ,వాసన తెలియకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, మాస్క్‌ ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి.  వీటితోపాటు సరైన పోషకాలు శరీరానికి అందేలా డైట్‌ పాటించాలి. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంది. మరి సపోటా పండులోని పోషకాలు.. ఆరోగ్య లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 

కంటి చూపుకు మెరుగుపరుస్తుంది: 
సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం..విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో విటమిన్‌ ఏ,సీ లు పుష్కలంగా ఉంటాయి.
తక్షణ శక్తిని ఇస్తుంది: 
సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోట పండు తినడం వల్ల వెంటనే శక్తిని పొందవచ్చు.
యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్:
సపోటా నొప్పులను, మంటను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. టన్నిస్‌ అధికంగా ఉండడం వల్ల యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తుంది.
కొన్ని రకాల కాన్సర్లను అరికడుతుంది: 
విటమిన్ ఏ, బి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు కాన్సర్ ను౦చి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఏ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

              

ఎముకలు దృఢంగా: 

కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఎముకలు గట్టిగా తయారవుతాయి.

జలుబు, దగ్గు: 
చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు తగ్గడానికి సపోటా పండు దోహదం చేస్తుంది.

యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్:
పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు ఉండడం వల్ల, సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు బాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంతోతేనిక్ జీర్ణ వ్యవస్థకు మెరుగుపచడమే కాకుండా విటమిన్ సి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది.

రక్తస్రావాన్ని అరికడుతుంది:
సపోటా రక్తస్రావాన్ని ఆపుతుంది. దెబ్బలు తగిలినపుడు, మొలల సందర్భంలో రక్తస్రావాన్ని నివారిస్తుంది.

మానసిక ఆరోగ్యం:
ఈ పండు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది.

 బరువు తగ్గిస్తుంది:
గ్యాస్ట్రిక్‌ ఎంజైమ్‌ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధించడమే కాక..జీవక్రియను నియంత్రిస్తుంది. 

(11 May, 2021 సాక్షి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid