శశాంకాసనం
ఈ ఆసనము చంద్రుని పోలి ఉంటుంది. అందువల్లనే శశాంక(చంద్ర) ఆసనం అన్నారు.ఈ ఆసనం ఇలా వేయాలి. 1. వజ్రాసనంలో కూర్చోవాలి. 2. తొడల పైన అరచేతులను మోకాలి పైభాగమున పెట్టుకోవాలి. 3. ప్రశాంతంగా కళ్ళుమూసుకుని, కొంచెం సేపు రిలాక్సయి, వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి. 4. శ్వాస తీసుకునే సమయంలో చేతులను తలపై భాగానికి ఎత్తి వాటిని భుజాలకు సమానంగా ఉంచాలి. 5. గాలిని వదులుతూ తుంటి భాగం నుండి శరీరాన్ని ముందుకి వంచాలి. 6. చేతులను, తలను సన్నగా శరీరానికి సమంగా ఉంచాలి. 7. చివరగా చేతులను, ముందుకి సాగదీస్తూ నుదురుభాగం మోకాలికి ముందు నేలను తాకేటట్లుగా ఉంచాలి. 8. చేతులను కొంచెం వంచి మోచేతులు భూమికి తాకేటట్లుగా ఉంచాలి. 9. పై ప్రకారంగా సౌకర్యంగా ఉన్నంత సేపు ఉండొచ్చు. ముందుగా తల బరువుగా ఉండొచ్చు. అలా అనిపిస్తే కొంచెం సేపు అలాగే ఉండాలి. కొంత సేపటికి తగ్గిపోతుంది. 10. కొం...