వజ్రాసనం



         ఈ ఆసనము శరీరంలో పిక్కలు గట్టిగా వజ్రంలా చేస్తుంది.

1. మోకాళ్ళపై నిల్చుని బొటనవేళ్ళు రెంటిని దగ్గరగా ఉంచి, మడమల్ని మాత్రము విడిగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే పిరుదుల్ని రెండు పాదాల మధ్యగా ఉండేటట్లుగా చూసుకుని కూర్చోవలెను. ఆ విధముగా కూర్చునప్పుడు పాదాల లోపలి భాగాలు, మడమలు కటి భాగాన్ని రెండు వైపులా తాకేలా ఉండాలి.

2. అరచేతులు మోకాళ్ళపై ఉంచి కూర్చోవాలి.

3. ఆ విధముగా కూర్చునేటప్పుడు తల,మెడ, నిటారుగా ఉండాలి.

4. కళ్ళు మూసుకుని శరీరము, మనస్సు ప్రశాంతముగా రిలాక్స్ గా ఉండాలి.ఈ ఆసనాన్ని ఎంత సేపైనా ఉండవచ్చు. మీకు ఎంత వరకు ఇబ్బంది కలగకుండా ఉండేంత వరకు మాత్రమే ఉండవచ్చు. గమనించాల్సిందేమంటే
భోజనం చేశాక  5 నుంచి 10 ని.లకు తక్కువగా కాకుండా ఈ ఆసనం వేస్తే జీర్ణశక్తి బాగుంటుంది. అంతేకాక మితిమీరి ఆహారం భుజించినా ఆహారము అరగక మలబద్ధకము అనిపించినా వజ్రాసనము వేయటం శ్రేయస్కరం 

 వజ్రాసనాన్ని వేసినప్పుడు కాళ్ళకి ప్రవహించే రక్తము కటిభాగానికి ఉదరభాగానికి విస్తారంగా వెళుతుంది. అందుచేత పొట్టలోని అవయవాలకి రక్తం విస్తారంగా సరఫరా అవుతుంది.  
హెర్నియాకి, మొలల తో బాధలు పడేవారికి ప్రయోజనం ఉంటుంది.
హైపర్ ఎసిడిటి, అల్సర్లున్న వారికి కూడా  వజ్రాసనం ఉపయోగకరం.
వజ్రాసనం లో నడుం నిటారుగా ఉండటం వలన 
సయాటికా వలన బాధపడేవారికి, నడుం నొప్పుల వల్ల బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది.

          వజ్రాసనము వేసేటప్పుడు తొడలకు నొప్పి కలిగినట్లైతే కాళ్ళని కొద్దిగాదూరంగా మోకాళ్ళ దగ్గర ఖాళీ ఏర్పాటు చేసుకోగల్గిన ఉపశమనము కలుగుతుంది.
మొట్టమొదటిసారిగా ఈ ఆసనం వేసేవారికి చీలమండల వద్ద బాధగా ఉంటే ,ఎక్కువసమయం ఈ వజ్రాసనంలో ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులుగా ఉంటే, ఆసనంలోంచి బయటకు వచ్చి కాళ్ళు ముందుచాపి కాళ్ళను కదుపుతూ ఉంటే ఉపశమనము కలుగుతుంది. 
 ఈ ఆసనము మొదటిసారిగా వేసినప్పుడు సౌకర్యంగా ఉంటానికి మోకాళ్ళకి, మడమకి మధ్య టవల్ ని మడతపెట్టి ఉంచుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid