కొవ్వుపదార్ధాలు మరియు కోలెస్టరాల్






 ∆శాచురేటెడ్ (సంతృప్త) కొవ్వుపదార్ధాలకు
 శాచురేట్ కానటువంటి (అసంతృప్త) కొవ్వు పదార్థాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి?


శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు పశు ఉత్పత్తులలోను మరియు ప్రొసెస్ట్ ఆహార పదార్థాలలోనూ - మాంస
పదార్థాలలోను, పాల ఉత్పత్తులలోనూ, చిప్స్ లోను మరియు పేస్ట్రీల వంటి వాటిలోనూ ఉంటాయి.
శాచురేటెడ్ కొవ్వు పదార్థం యొక్క రసాయనిక నిర్మాణక్రమం హైడ్రోజెన్ ఆటమ్స్ తో పూర్తిగా సంతృప్తమై,నిండిపోయి ఉంటుంది, అలాగే కార్బన్ల మధ్య డబుల్ బ్యాండ్స్ ను కలిగి వుండదు. ఇటువంటి శాచురేట్ చేయబడిన కొవ్వు పదార్థం గుండెకు మంచిది కాదు. ఎందుకంటే ఇవి మీలో ఉండే లో డెన్సిటీ (తక్కువ సాంద్రత కల) లిపోప్రొటీన్ (ఎల్.డి.ఎల్) కోలెస్టరాల్ ను ('చెడు కొలెస్టరాల్', ఇంకా పెంచుతూ ఉంటాయి.

      శాచురేట్ చేయబడని కొవ్వు పదార్ధాలు, నట్స్ లోనూ, ఏవోకేడోస్ లోనూ మరియు ఆలివ్స్ లోనూ ఉంటాయి.ఇవి సాధారణ ఉష్ణోగ్రత (రూమ్ టెంపరేచర్) వద్ద ద్రవరూపంలో ఉంటాయి. వీటి యొక్క రసాయనిక నిర్మాణం డబుల్ బ్యాండ్స్ కలిగి ఉండి శాచురేట్ చేయబడిన కొవ్వు పదార్థాలకు భిన్నంగా ఉంటాయి. దీనికి తోడు ఈ శాచురేట్ చేయబడని కొవ్వు పదార్థాలు గుండెకు కూడా మంచివని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి.
వీటికి ఎల్ డి.ఎల్. కొలెస్టరాల్ ను తగ్గించగల సామర్థ్యం ఉంది. అలాగే హెచ్.డి.ఎల్. (హై డెన్సిటీ లిపోప్రొటీన్) కోలెస్టరాల్ ('మంచి' కోలెస్టరాల్) ను పెంచగలవు కూడా..

        శాచురేట్ చేయబడిన మరియు శాచురేట్ చేయబడని కొవ్వు పదార్థాలలో ఉండే తేడాను - తెలుసుకోవడం వల్ల మీ కొలెస్టరాల్ ను తగ్గించు కోవడానికి సహాయపడుతుంది. ఈ ఉభయ కొవ్వుపదార్ధాలు, అంటే శాచురేట్ చేయబడినవి, చేయబడనివి అనేక రకాలైన ఆహారపదార్ధాలలో ఉన్నా, ఈ కొవ్వు పదార్ధాలు రెండు కూడా ఒకే స్థాయిలో ఉండవని అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి. శాచురేట్ చేయబడని కొవ్వు పదార్థాలు మీ గుండెకు మంచివికాగా శాచురేట్ చేయబడిన కొవ్వు పదార్థాలు మీ గుండెకు కీడు చేస్తాయి.
              అందుచేత మీరు కోలెస్టరాల్ ను తగ్గించుకునే దిశగా ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటే,శాచురేట్ చేయబడని కొవ్వు పదార్ధాలు, మీ కొలెస్టరాల్ స్థాయిని ఇంకా పెంచుతూ పోవు. ఏమైనప్పటికీ,ఎక్కువగా శాచురేట్ చేయ బడిన కొవ్వు పదార్థాలు తినడం మానివేయడానికి ప్రయత్నించాలి.



 ∆      మోనో అన్ శాచురేటెడ్ ఏక అసంతృప్తమైన కొవ్వు పదార్థాలకు మరియు పోలి అన్ శాచురేటెడ్
(బహుఅసంతృప్తమైన) కొవ్వు పదార్ధాల మధ్య ఉన్న తేడా ఏమిటి?

గుండె దారుణ్యాన్ని పెంచేటువంటివిగా రుజువు కాబడిన, శాచురేట్ చేయబడని కొవ్వు పదార్థాలను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు: మోనో అన్ శాచురేటెడ్ మరియు పోలీ అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలుగా.
          మోనో అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు మరియు పోలీ అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్ధాల మధ్య ఉండే వ్యత్యాసం వాటి నిర్మాణంలో ఉంటుంది, మోనో అన్ శాచురేటెడ్ కొవ్వుపదార్ధా లలో వాటి నిర్మాణంలో ఒక డబుల్ బాండ్ ఉంటుంది. అయితే, దీనికి బదులుగా, పోలీ అన్ శాచురేటెడ్ కొవ్వుపదార్థాలలో, వాటి నిర్మాణంలో రెండు లేక అంతకంటే ఎక్కువగా డబుల్ బాండ్స్ ఉంటాయి. శాచురేటెడ్ కొవ్వు పదార్థాలను మరియు ట్రాన్స్ ఫాట్ ఉన్న పదార్థాలకు బదులు మోనో అన్ శాచురేటెడ్ మరియు పోలి అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్ధాలు ప్రధానంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం గుండె జబ్బునుండి మిమ్మల్ని మీరు రక్షించు కోవడానికి సహకరిస్తుంది, దీనికి సంబంధించి, మోనో అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థం కంటే పోలి అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థం మరింత మంచిదని పరిశోధనలో తేలింది.
         నేషనల్ కోలెస్టరాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రకారం మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలోని కేలరీలలో పోలి అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు 10 శాతం వరకూ ఉంటాయి. పోలి అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు కాయగింజలు, కూరగాయల నూనెలు (మొక్క జొన్న నూనె, కుసుమ నూనె) వంటి వాటినుండి లభిస్తాయి.

∆ కోలెస్టరాల్ అంటే ఏమిటి?

కోలెస్టరాల్ ఒక కొవ్వు వంటి పదార్థం ప్రధానంగా మన లివర్ (కాలేయం)లో తయారవుతుంది, కాని మనం తినే వివిధ ఆహార పదార్థాలలో కూడా ఉంటుంది. మనకు కావలసినంత కొలెస్టరాల్ ను మన శరీరం తయారు చేయగలదు.కాని కోలెస్టరాల్ మనకు అసలు ఎందుకు కావాలి? వాస్తవంగా, కొలెస్టరాల్ మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. 
ఈ క్రింది వాటితో సహా
• కణజాలపు పొరల నిర్మాణం మరియు పోషణ
   లైంగిక హార్మోన్ల నిర్మాణం
• ఆహారాన్ని జీర్ణించుకోవడానికి సహకరించే పిత్తరస 
   లవణాలను ఉత్పత్తి చేయడం
• విటమిన్ 'డి ' ను తయారు చేయడం


∆ప్రతి రోజు మీరు తీసుకోవలసిన కోలెస్టరాల్ ఎంత  
   పరిమాణంలో ఉండాలి?


         మీ శరీరంలో కొలెస్టరాల్ అధిక పరిమాణం
లో ఉండి, మీ ఆరోగ్యానికి చెడును కలిగిస్తున్నా, 
మీ శరీరంలో ఇది ఒక ముఖ్యమైన రసాయనిక సమ్మేళనం. శరీరంలో చోటు చేసుకునే అనేక ప్రక్రియలకు కోలెస్టరాల్ దే బాధ్యత.
        ఉదాహరణకు కొలెస్టరాల్ లైంగిక మరియు స్టిరాయిడ్ (లైంగిక అవయవాలను ప్రేరేపించేది) హార్మోన్లకు ఒక ముఖ్యమైన మూలకారణంగా ఉంటుంది. కణ జాలపు పొరల నిర్మాణ క్రమంలో కొలెస్టరాల్ ఒక ప్రధానమైన,కీలకమైన రసాయనిక సమ్మేళనం కాబట్టి మన శరీరంలో ప్రతి కణానికి కూడా ఇది నిర్మాణ సంబంధిత సహకారాన్నంది స్తుంది. ఇంతే కాకుండా, మెలిన్ షీత్ (నరాలపై ఉండే పీచు వంటి పొందికను తయారుచేయడానికి కూడా కొలెస్టరాల్ అవసరం అవుతుంది. అధిక కొలెస్టరాల్ కు మరియు గుండె జబ్బుకు మధ్య ఒక బలమైన సంబంధం ఉన్నప్పటికీ, మన శరీరానికి కొంత కోలెస్టరాల్ అవసరం ఉంది. తరీరంలో అవసరమైన వివిధ ప్రక్రియల కోసం కాలేయం సగటున ఇంచు మించుగా 80 శాతం వరకు కోలెస్టరాల్ ను
అందిస్తుంది, మిగతాది మనం తీసుకునే ఆహారం నుండి లభిస్తుంది.
           ప్రతి రోజు మీరు తీసుకునే కోలెస్టరాల్
రోజుకు 200 మి.గ్రా, మించి ఉండకూడదు. అయిన ప్పటికి, కాలేయం మన రోజువారి అవసరాలకు సరిపోయేంత కోలెస్ట్రాల్ ను తయారుచేయగల సామర్థ్యాన్ని కలిగివుంది.అందుచేత, ఆహారం నుండి వాస్తవంగా మనకు కోలెస్టరాల్ ఏమీ కావలసిన అవసరం లేదు.
       
        ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా, మనం తీసుకునే ఆహారం నుండి లభించే కొవ్వు మన కోలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్ స్థాయిలకు విపరీతంగా దోహదం చేస్తుంది. మంచిది కాని కొవ్వు పదార్థం అతిగా తీసుకోవడం వలన మీ శరీర కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలలో వస్తూ ఉన్న పెరుగుదలను మీరు గమనించవచ్చు. మనం తీసుకునే ఆహారం నుండి లభిస్తూవుండే కొవ్వు పదార్ధాన్ని నియంత్రీకరించడానికి,  కొన్ని చిట్కాలున్నాయి.అవేమంటే.....
        సరైన కొవ్వు పదార్థాన్నే తినండి. ఏ వ్యక్తి కూడా, ఏ మాత్రం కొవ్వు పదార్థాలను తినకూడదు అని అనుకోవడంలో అర్థంలేదు. అందుచేత
కోలెస్టరాల్ ను మరియు ట్రైగ్లిసరైడ్ స్థాయిలను
నియంత్రీకరించడానికి సరైన, అనువైన కొవ్వు పదార్థం, సరైన మొత్తంలో తీసుకోవడం అన్నదే
మంచి మార్గం. శాచురేట్ కాని (అసంతృప్తమైన) కొవ్వు పదార్ధాన్ని అంటే మొక్కల ఆధారిత
ఆహారంలో ఉండే కొవ్వును తప్పకుండా తీసుకుంటూ ఉండండి. ఇటువంటి కొవ్వు పదార్థం మీలోని హెచ్.డి.ఎల్. ను పెంచి, ఎల్.డి.ఎల్. ను తగ్గించి వేస్తుంది మరియు మీ గుండె జబ్బు ప్రమాద
తీవ్రతను ఇంకా తగ్గిస్తుంది. శాచురేటెడ్ (సంతృప్తమైన) ఆహారం, పశు ఆధారిత ఆహారం నుండి తీసుకున్నటువంటిది మీ హెచ్.డి.ఎల్. స్థాయిలను తగ్గిస్తుంది, ఎల్ డి ఎల్ స్థాయిను అధికం
చేస్తాయి - ఈ ఉభయ అంశాలు కూడా మీ గుండె జబ్బు ప్రమాద తీవ్రతను పెంచుతాయి.

          సరైన పరిమాణంలోనే కొవ్వు పదార్ధాలను ఆరోగ్యంగా ఉండే వయోజనులకు, మీ మొత్తం
క్యాలరీలలో 30 శాతానికి మించకుండా, కొవ్వు నుండి రావాలి. ఈ 30 శాతంలో 7 నుండి 10
శాతం వరకు శాచురేటెడ్ కొవ్వు పదార్థం నుండి, మొత్తం క్యాలరీలలో 10 నుండి 15 శాతం వరకూ
మోనో అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థం నుండి, 10 శాతం పోలి అన్ శాచురేటెడ్ కొవ్వు పదార్థం
నుండి రావాలి.
        చక్కటి సమీకృత ఆహారన్ని తినండి.
చక్కటి, పుష్టికరమైన ఆహారం ప్రతి రోజు 5 లేక అంతకంటే ఎక్కువగా పళ్లు, మరియు కూరగాయలతో సహా ఉంటుంది. ఈ మొత్తంలో ముడి ఆహార ధాన్యాలు, బీన్స్ మరియు అపరాలు (కాయధాన్యాలు). కూడా ఉండాలి. తీపి పదార్థాలను మరియు కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినడంలో పరిమితంగా ఉండండి.



∆మనం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వు పదార్థం,
   ట్రైగ్లిసరైడ్స్ అంటే ఏమిటి?

       మన శరీరంలో అధిక భాగంలో ఉండే కొవ్వు అలాగే మనం తినే ఆహారంలో ఉండే కొవ్వు రసాయనిక రూపంలో ఉండేవే ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి. మనం తిన్నప్పుడు, ఆహారంలోని ఈ కొవ్వు పదార్థాలు మన శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ గా మార్పు చెందుతాయి. మన శరీరానికి శక్తి అవసరమైనప్పుడు ట్రైగ్లిసరైడ్స్ విడుదల చేయబడతాయి, ఇవి ఇంధనంలా వినియోగింపబడి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. మామూలుగా మీరు చేయించుకునే ఆరోగ్య పరీక్షలలో, వైద్యుడు రక్త పరీక్షను నిర్వహిస్తాడు, మీ రక్తంలో ఉండే కోలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ ఏ పరిమాణంలో ఉన్నాయి అని కొలవడానికి కొంతమంది విషయంలో ఇవి సరిగానే ఉంటాయి. కాని చాలా మందిలో వారి ఆహారం, వారు తీసుకునే మందుల విధానం,
లేక వారి జన్యుపరమైన పొందిక అన్నవి అధిక కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలకు
కారణమవుతాయి, శరీరావసరానికి మించి ఉండేలాగ, దురదృష్టవశాత్తూ, అధికం అన్నది ఇక్కడ మంచిది కాదు. వాస్తవంగా, అధికమైన కోలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ మీ రక్తంలో ఉండడం మీ ఆరోగ్యానికి గట్టి దెబ్బ వంటిది, సాధారణ స్థాయికి మించి ఉండే ట్రైగ్లిసరైడ్స్
మరియు కోలెస్టరాల్ ఈ క్రింది వాటిలో సంబంధం
కలిగి ఉన్నట్లు భావించబడుతున్నాయి.
.ఛాతినెప్పితో మరియు గుండె పోటుతో ఉండే గుండె జబ్బు
• పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (కాళ్లలో మూసుకు పోయిన ధమనులతో)
. తలలోనూ మరియు మెడభాగంలోనూ మూసుకుపోయిన ధమనుల ఫలితంగా వచ్చే స్ట్రోక్
(వాతం)
• పాంక్రియాటిటిస్ మరియు లిపోడిస్ట్రోఫీ


∆కోలెస్టరాల్ స్థాయిలను ప్రభావితం చేసే అంశాలేవి?

          కోలెస్టరాల్ స్థాయిలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో కొన్ని మన ఆధీనంలో లేవు. ఉదాహరణకు: ఒక జన్యుపరమైన ప్రవృత్తి, అధిక స్థాయిలో కొలెస్టరాల్ ధోరణి (కుటుంబ చరిత్రకు సంబంధించి). 
 కాని, మన అధీనంలో ఉండే అంశాలు చాలానే ఉన్నాయి. ఇవి:
.అధికమైన కొవ్వు పదార్థం మరియు/లేక కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్ధాలు) తో ఉండే ఆహరం
• వ్యాయామం చెయ్యకపోవడం
.మందులు వాడే విధానాలు కొన్ని హెచ్.ఐ.వి. కు ఉపయోగించే వాటితో సహా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid