రాత్రి భోజనం విషయంలో జాగ్రత్తలు

మనిషికి ఆహారం అనేది చాలా అవసరం. ఆహారం లేకుండా మనం జీవించలేము. అయితే.. తీసుకునే ఆహారం.. తినే వేళలు కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అయితే..రాత్రిపూట చెడు ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని  పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది. రాత్రివేళ భోజనం త్వరగా జీర్ణం అవ్వదు.  కాబట్టి.. మనం రాత్రిపూట ఎక్కువగా తింటే, అది జీర్ణం కాదు.. దానివల్ల  మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

కాబట్టి.. రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాత్రిపూట త్వరగా అరిగిపోయే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు తీసుకుంటే.. అవి త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి.

రాత్రిపూట అతిగా తినకండి. తక్కువ పరిమాణంలో తినడం చాలా మంచిది.

భోజనంలో ఎక్కువ బీన్స్, ఆకుకూరలు ఉండేలా  చూసుకోవాలి. అంతేకాకుండా  తక్కువ మొత్తంలో అల్లం లాంటి మసాలాలను వాడాలి.

భోజనంలో ఎక్కువ బీన్స్, ఆకుకూరలు ఉండేలా  చూసుకోవాలి. అంతేకాకుండా  తక్కువ మొత్తంలో అల్లం లాంటి మసాలాలను వాడాలి

పడుకోవటానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిది.

రాత్రి 8 గంటలకు ముందే భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి 8 గంటలకు ముందే భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ... పడుకునే ముందు మళ్లీ ఆకలిగా అనిపిస్తే.. ఏదైనా లైట్ గా తీసుకోవాలి. లేదంటే ఏదైనా పండు తినొచ్చు.

ఒకవేళ... పడుకునే ముందు మళ్లీ ఆకలిగా అనిపిస్తే.. ఏదైనా లైట్ గా తీసుకోవాలి. లేదంటే ఏదైనా పండు తినొచ్చు.

జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, పాస్తా, బర్గర్స్, పిజ్జా, బిర్యానీ, రైస్, ఫ్యాటీ చికెన్, మటన్, సోడా, వేయించిన బంగాళాదుంపలు, చిప్స్, చిల్లిలోస్, స్వీట్స్ మరియు చాక్లెట్ రాత్రిపూట తినడం మానేయాలి

జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, పాస్తా, బర్గర్స్, పిజ్జా, బిర్యానీ, రైస్, ఫ్యాటీ చికెన్, మటన్, సోడా, వేయించిన బంగాళాదుంపలు, చిప్స్, చిల్లిలోస్, స్వీట్స్ మరియు చాక్లెట్ రాత్రిపూట తినడం మానేయాలి

(Asia net)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid