మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నారా?


మనం రోజుకు 40,000సార్లు శ్వాసిస్తాం.

మీరు  సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారా? 

ఈ ప్రశ్న కొద్దిగా కన్ ఫ్యూజ్ గా, అర్ధం కాకుండా ఉంది కదూ. కాని దీని గురించి ఫస్ట్ తెలుసు కోవాలి. ప్రతి ఒక్కరూ ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవటం లేదని పరిశోధనల్లో తేలింది.
          ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం.

1. కాలకృత్యాలు... స్నానం.... పూర్తి చేసుకోండి.

2. 5-30-6-00ల మధ్య బ్రహ్మ ముహూర్త సమయం బెస్ట్... ది బెస్ట్.

3. ఈ సమయంలో  మనసు ప్రశాంతంగా ఉంటుంది.చక్కని గాలి లభిస్తుంది.

4. పలుచటి బట్టని నేలపై పరవండి.

5. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం... ఈ మూడింటిలో మీకిష్టమైన ఆసనాన్ని వేసుకోండి.

6. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి.

7. మీ దృష్టి పొట్ట కదలికల మీద పెట్టండి.

8. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వెళ్తు వెనక్కి వెళ్తుందా...అలాగే ఛాతీ ముందుకు, వెనక్కి.... అలాగే గాలి వదలినప్పుడు ఛాతీ ముందుకా, వెనక్కా....బాగా గమనించండి. రెండు నిమిషాలు ఏకాగ్రతగా గమనించండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. . ,
ఓ.కే. రెండు నిమిషాలు అయిపోతాయి. నెమ్మదిగా కళ్ళు తెరవండి.

10. గాలి పీల్చినప్పుడు లోపలకు, బైటకు, అలాగే గాలి వదలినప్పుడు పొట్ట కదలిక లోపలికి, బైటకి పేపర్ పై రాసి పెట్టుకోండి.

ఓ.కే.ఏది కరెక్టో మీకే తెలుస్తుంది. ముందుకు వెళ్ళండి.

1. మళ్ళీ కళ్ళు మూసుకోండి...

2. దృష్టి శ్వాస మీద పెట్టండి.

3. పొట్టని నెమ్మదిగా లోపలికి లాక్కుంటూ, గాలి వదలండి.... నెమ్మదిగా.....చాలా నెమ్మదిగా... పొట్టని వీలయినంత లోపలికి లాక్కుంటూ...

4. వెంటనే గాలి తీసుకోండి.

5. మళ్ళి గాలి వదలండి.. అలా పదిసార్లు చేయండి.
వన్....టూ... త్రీ... ఫోర్..... జాగ్రత్తగా గమనించండి. మీరు గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వీలయినంత నెమ్మదిగా లాక్కుంటూ... ఆపై
గాలి తీసుకోండి. ఫైవ్... సిక్స్.... సెవన్.... ఎయిట్... నైన్.... టెన్... ఓకే.. కళ్ళు తెరవండి.
ఇప్పుడు చెప్పండి. ఇంకా అర్ధం కాకపోతే పొట్టపై చేయి పెట్టుకుని చూడండి.
గమనించండి. మీకు తెలుస్తుంది. తేడా..

1. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి.

2. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు...

ఓ.కే. అది. అది కరెక్ట్ గా శ్వాస తీసుకునే పద్ధతి. ఇంకా గమనించండి. బాగా బాగా గమనించండి....
మీ శ్వాస తీసుకునే పద్ధతి రిలాక్స్ గా ప్రశాంతంగా ఉంటుంది.దురదృష్టవశాత్తు చాలా మంది ఛాతితో గాలి తీసుకుంటారు. అనారోగ్యం వల్లనే కాదు. నాగరికత వల్ల కూడా,టక్ చేస్తుంటారు. దాని వల్ల గాలి తీసుకునే పొట్ట డ్యూటీ కొంత ఛాతీ
తీసుకుంటుంది. ఒక పని మరొకరు చేస్తే ఏమవుతుందో తెలింది కాదు కదా! సో.. మీరు సరైన పద్ధతిలో శ్వాస తీసుకుంటూంటే ఓ.కే. లేకపోయినా వదలివేయండి. మీ మనసులోంచి పూర్తిగా తీసేయ్యండి. 





మైథిలీ వెంకటేశ్వరరావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid