గుడ్డుతో గుడ్ కొలెస్ట్రాల్! గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాల క్రితం గుడ్డులో ఉండే కొలస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలామందిలో ఉండేది. కానీ ఒక పెద్దగుడ్డులో 180 నుండి 186 మిల్లీగ్రాముల కొలస్ట్రాల్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కొలస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయం కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటుంది. అంటే రోజుకు మూడుగుడ్లు తిన్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదన్నమాట. కాబట్టి, రెగ్యులర్ డైట్లో గుడ్డు చేర్చుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది. ఒక గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లేవిన్ ఫాల్లాట్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, ఇతర న్యూట్రిషియన్స్ అధికంగా ఉన్నాయి. గుడ్డులో ఉండే హై డెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్ డీ ఎల్) శరీరం, బ్రెయిన్‌కు చాలా అవసరం. హెచ్ డీ ఎల్ శరీరంలో ప్రతి సెల్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్,కార్టిసోల్ ఉత్పత్తికి సహాయపడు...
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
SOUR SPINACH / గోంగూర
ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. ఈ ఆకు కూర గురించి తెలియని వారుండరు. గోంగూరతో మనం పచ్చడిని, పప్పును, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందొచ్చు. *_🍃గోంగూర ఆకుల (Sorrel Leaves)తోనే కాకుండా గోంగూర కాయల మీద ఉండే పొట్టుతో కూడా పచ్చడిని తయారు చేస్తారు. గోంగూర ఆకులతోపాటు కాయలు, పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గోంగూరను పంటగా వేసి వాటి నుంచి నారను తీసి సంచులను తయారు చేస్తుంటారు. మనకు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర వంటి రెండు రకాల గోంగూరలు లభిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూరతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి._🍃* *_🍃గోం...
మెనోపాస్/ఆండ్రోపాస్
ఒక వయసు వచ్చే సరికి స్త్రీ మరియు పురుషులలో హార్మోన్ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే స్త్రీ లు ఒక 40 లేదా 45 సంవత్సరాలు వచ్చేసరికి వారికి మెనోపాస్(MENOPAUSE) లక్షణాలు కనిపిస్తుంటాయి. స్త్రీ లకు నెలసరి ఆగిపోయే సమయానికి ముందు వచ్చే సమయాన్ని మోనోపాస్ అంటారు. ఇది కొన్ని హార్మోన్స్ అసంతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వలన మోనోపాస్ సమయంలో కొన్ని ఆసవకార్యాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మగవారిలో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మగవారిలో వచ్చే సమస్య ను ఆండ్రోపాస్(ANDROPAUSE) అంటారు. ఆండ్రోపాస్ సమస్య వినని వారు చాలా మందే ఉంటారు. అయితే పురుషులలో ఆండ్రోజెన్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడాన్ని ఆండ్రోపాస్ అంటారు. మహిళల లో మోనోపాస్ దశ వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే వారిలో మోనోపాస్ దశ లో పిరియడ్స్ ఆగిపోతాయి. అలాగే మగవారిలో ఆండ్రోపాస్ దశ వచ్చింది అని తెలియాలి అంటే 13 రకాల లక్షణాలలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈ లక్షణాలలో మొదటిది శృం గారం పై ఆసక్తి తగ్గుతుంది. రెండవది పురుషులలో 40 లేదా 45 సంవత్సరాలు వచ్చే సరికి అం గం గట్టిపడటం ఆగిపోతుంది. మూడవ సమస్య వచ్చే సరికి మగవారి వీ*ర్యం...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి