జీవన శైలి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
మెరుగైన పారిశుధ్యం, టీకాలు, యాంటీ బయాటిక్స్ , వైద్యపరమైన అప్రమత్తతను పాటించడం ద్వారా, పెక్కు సంక్రమణ వ్యాధులు ప్రాణాంతకం కాకుండా ఆధునిక విజ్ఞానం నివారించ గలిగింది.
గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వల్ల కలిగే వ్యాధులే ఇప్పుడు మరణానికి ప్రాథమిక కారణాలుగా మారాయి. మరణానికి దారితీసే కారణం ఏదైనా, ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అయితే, జీవన శైలి వల్ల కలిగే వ్యాధులు అకాల మరణాలకు దారితీస్తున్నాయి. ఇటీవలికాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవన శైలి వల్ల కలిగే వ్యాధుల కారణంగా చాలామంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు.
భారతదేశం విషయంలో చూస్తే, ఈ పరిస్థితి ఎంతో ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఇలాంటి వ్యాధుల తీరు ఎప్పటికప్పుడు మారిపోతున్నది. సమీప భవిష్యత్తులో అత్యధికంగా జీవన శైలి సంబంధిత వ్యాధులు సోకే దేశంగా భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ ) గుర్తించింది. ఇటీవలికాలంలో, జీవన శైలి సంబంధితవ్యాధులు సోకడం అతి సాధారణంగా మారిపోవడమేకాదు , చిన్న వయసువారు కూడా వీటికి గురవుతున్నారు.
ఈ కారణంగా, ముప్పుకు లోనయ్యే జనాభా సగటు వయసు 40+ నుంచి 30+ కి , ఇంకా ఆ దిగువకు కూడా దిగజారుతున్నది. ఇప్పటికే , ప్రపంచ మధుమేహపు రోగుల రాజధాని అన్న అప్రతిష్టను మూటగట్టుకున్న భారతదేశం ఇప్పుడు, జీవన శైలి సంబంధిత వ్యాధుల రాజధాని అనే చెడు పేరును కూడా తలకెత్తుకోనున్నది. భారతదేశంలో
అధిక రక్తపోటు, స్థూల కాయం, గుండె జబ్బులు సోకడం, ముఖ్యంగా పట్టణ యువతకు సోకడం, ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నట్టు అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్), మాక్స్ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
కాలు కదపకుండా కూర్చొని చేసే ఉద్యోగాలు, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం,మద్యపానమే ఈ స్థూల కాయం, మధుమేహం, రక్తపోటు వ్యాధులు సోకడానికి ప్రధాన కారణాలని వైద్యులు చెపుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి