శశాంకాసనం
ఈ ఆసనము చంద్రుని పోలి ఉంటుంది. అందువల్లనే శశాంక(చంద్ర) ఆసనం అన్నారు.ఈ ఆసనం ఇలా వేయాలి.
1. వజ్రాసనంలో కూర్చోవాలి.
2. తొడల పైన అరచేతులను మోకాలి పైభాగమున
పెట్టుకోవాలి.
3. ప్రశాంతంగా కళ్ళుమూసుకుని, కొంచెం సేపు
రిలాక్సయి, వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి.
4. శ్వాస తీసుకునే సమయంలో చేతులను తలపై
భాగానికి ఎత్తి వాటిని భుజాలకు సమానంగా
ఉంచాలి.
5. గాలిని వదులుతూ తుంటి భాగం నుండి శరీరాన్ని ముందుకి వంచాలి.
6. చేతులను, తలను సన్నగా శరీరానికి సమంగా
ఉంచాలి.
7. చివరగా చేతులను, ముందుకి సాగదీస్తూ
నుదురుభాగం మోకాలికి ముందు
నేలను తాకేటట్లుగా ఉంచాలి.
8. చేతులను కొంచెం వంచి మోచేతులు భూమికి
తాకేటట్లుగా ఉంచాలి.
9. పై ప్రకారంగా సౌకర్యంగా ఉన్నంత సేపు
ఉండొచ్చు. ముందుగా తల బరువుగా ఉండొచ్చు.
అలా అనిపిస్తే కొంచెం సేపు అలాగే ఉండాలి.
కొంత సేపటికి తగ్గిపోతుంది.
10. కొంచెము సేపు ఆ విధంగా ఉన్న తరువాత
మెల్లగా చేతులను పైకెత్తి మీరు మరల
వజ్రాసనంలోకి రావాలి.
పై ప్రకారంగా కనీసం 3 నిమిషములలో మూడు నుంచి 5 సార్లు క్రమం తప్పకుండా నిత్యం సాధన చేయాలి.
ప్రయోజనాలు:
1. వెన్నెముకలోని నరాలు కీళ్ళ డిస్క్ లలో అణచివేయబడటం వలన అనేక విధాలులుగా వీపు నొప్పికి కారణం. ఈ ఆసనంతో సమస్యలు తీరి కీళ్ళ
డిస్క్ లను వాటి యధాస్థితికి వస్తాయి.
2. అడ్రినల్ గ్లాండ్స్ సక్రమంగా పనిచేస్తాయి.
3. పొత్తికడుపు కండరాలు, కటిభాగ నరాల సక్రమంగా ఉండేటట్లు పెల్విన్ పెరుగుదల సరిగా లేని స్త్రీలకు చాలా ఉపయోగకరం.
4. స్త్రీ, పురుషుల యొక్క ప్రత్యుత్పత్తి అంగాలలోని అవకతవకలను సరిచేస్తుంది.
5. క్రమం తప్పకుండా చేస్తే మలబద్ధకం పోతుంది.
6. ఈ ఆసనంలో వెన్నెముక మధ్యభాగము బాగా స్ట్రెచ్ చేయబడుతుంది. స్లిప్ డిస్క్ సయాటికా ఉన్నవారికి చాలా ప్రయోజనకరం. అలాగే
నడుము కండరాలకు, వెన్నెముకకు మంచి
ప్రయోజనకారి.
7. మానసిక వత్తిడులను ఈ ఆసనం మంచి ఫలితాన్ని కలగచేస్తుంది. ఈ ఆసనం వేస్తే
మెదడుకి రక్తప్రసారం సునాయాసంగా జరుగుతుంది.
మెదడు ఎక్కువ రక్తాన్ని తీసుకుని, బాగా పనిచేస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి