పౌష్టికాహారం
ఏ ఆహారం మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుండేటట్లు చేసి,అనారోగ్యపాలుకాకుండా
శక్తివంతంగా ఉంచి జీవనపరిమాణం మెరుగయ్యేటట్లు చేస్తుందో దానినే పౌష్టికాహారం అంటారు .
పౌష్టికాహారములో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు ఉండాలి.అవి
1. మాంసకృత్తులు (proteins) .
2. పిండిపదార్ధాలు(carbohydrates) .
3. కొవ్వుపదార్థాలు (fats),
4. పీచుపదార్థము (fiber),
5. విటమిన్లు (vitamins),
6. ఖనిజలవణాలు(minerals) .
7. నీరు(water) .
ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా.... వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా.
ఆహారాన్ని శరీర పోషణకు తీసుకోవాలి.అంతేగాని రుచిగా ఉందనో,ఆకలిగా ఉందనో ఎక్కువగా తీసుకోరాదు. అందువల్ల
తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని తీసుకోవాలి.
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు, అదనపు ఆహారం, మరింత జాగ్రత్త అవసరం.
బిడ్డకు 4 నుండి 6 నెలల వయస్సు వచ్చేదాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, తల్లి పాలను రెండేళ్ళ
వరకు ఇవ్వవచ్చు.
శిశువులకు 4-5 నెలల వయస్సులో అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి.
ఆరోగ్యంగా వున్నా జబ్బున పడినా, పిల్లలు, కౌమార దశలో వున్న వాళ్ళు తగిన ఆహారాన్ని
సరిపడినంత తీసుకోవాలి,
ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్ళు సమృద్ధిగా వాడాలి.
వంటనూనెలు, జంతు సంబంధ ఆహారపదార్ధా లను పరిమితంగా వాడాలి, వనస్పతి, నెయ్యి,
వెన్నలను అరుదుగా మాత్రమే వాడాలి.
అతిగా ఆహారాన్ని తినకుండ, ఎక్కవు బరువు, స్థూలకాయాన్ని నిరోధించాలి,
ఉప్పును పరిమితంగా వాడాలి.
శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి,
నీళ్ళను తగిన పరిమాణాల్లో త్రాగాలి.
పానీయాలను పరిమితంగా సేవించాలి.
తినడానికి తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయబడ్డ పదార్థాలను ఆచితూచి తీసుకోవాలి.
చక్కెరను పరిమితంగా వాడాలి.
వయసు మళ్ళినవారు చురుకుగా ఆరోగ్యంగా వుండడానికి పుష్టికరమైన ఆహారాన్ని తినాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి