మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?



    మాంసకృత్తులు

      మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి.మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్ద వయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగాదెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయ పడుతుంది.
గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ
పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి.

ఆహారంలో మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?

        మాంసకృత్తులు శరీరానికి అవసరమైన
అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.
         ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతోతయారైన పదార్ధాలు, జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
       శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు
నుంచి పొందవచ్చు.
         వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.
         16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల
మాంసకృత్తులు అవసరం, అదే విధంగా 16 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల
బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం,
          గర్భవతికి రోజుకు 65 గ్రాములు ఒక రోజుకు అవసరమవుతాయి.పాలిచ్చేతల్లులకు,బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు 1 రోజుకు అవసరం.

ఆహార                         ప్రతి 100 గ్రాములకు  
పదార్ధాలు                   లభించే మాంసకత్తులు
                                       /గ్రాముల్లో
          

సోయాబీన్స్                            43.2

శెనగ పప్పు పప్పు, 
మినపప్పు, పెసరపప్పు,            22
ఎర్ర పప్పు,

కందిపప్పు                                23
వేరుశెనగపప్పు, 
బాదం పప్పు 
జీడిపప్పు

చేపలు                                      20                        

మాంసము                                22
ఆవు పాలు                                3.2
గేదెపాలు                                  4.3
కోడిగుడ్డు (సుమారు 
44 గ్రాములు)                           13.3 (ఒక గుడ్డుకు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

What Is Hyperthyroidism?