సుప్తవజ్రాసనము
వజ్రాసనంలో నిద్రపోవటం ఈ ఆసనం ప్రాముఖ్యత
1. వజ్రాసనంలో కూర్చోవాలి.
2. మొట్ట మొదట కుడిమోచేతిని, చేతి ఆధారముగా తరువాత ఎడమ మోచేతి ఆధారంగా వీపును బాగా వెనకకి ఉంచాలి.
3. తలపై భాగం నేలను అనుకునే విధంగా వెనకభాగము విల్లువలె వంచాలి.
4. రెండు చేతులను తొడలపై ఉంచాలి.
5. మోకాళ్ళను నేలకు తాకించినట్లుగా ఉండాలి. అవసరమనుకుంటే మోకాళ్ళను ఎడంగా పెట్టుకో వచ్చు. ఆ సమయం మోకాలి కండరాలకి, తొడలకి
ఎక్కువ వత్తిడి కలగకుండ చూసుకుని కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి.
6. శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. కాళ్ళను క్రమంగా సాగదీయకుండా ఈ స్థితిలోకి రాకండి. లేకపోతే మోకాలి కీళ్ళు బెణికే అవకాశముంది.ఒక నిమిషం తరువాత వజ్రాసనంలోకి రావాలి. తరువాత కాళ్ళను సాగదీయాలి.
గమనిక: తుంటి నొప్పి గలవారు, కీళ్ళు సడలినవారు, మోకాలి సంబంధమైన బాధలు
గలవారు ఈ ఆసనం వేయకూడదు.
ప్రయోజనాలు
1. జీర్ణక్రియను, శుద్ధపరిచి మలబద్ధకమును నివారిస్తుంది. ఉదరభాగ అవయవాలకు వ్యాయామం కలిగిస్తుంది. వీపు క్రింది భాగానికి, ఉదరభాగానికి మంచి ప్రయోజనం.
2. వెన్నెముక నరాలకు పటుత్వాన్ని పెంచుతుంది, వీపుని సాగదీస్తుంది. మెడనరాలు,థైరాయిడ్ గ్రంథి ప్రభావితమవుతాయి.
3. ఛాతీ సాధ్యమైనంత సంకోచ, వ్యాకోచాలు కలిగి వీలయినంత ఎక్కువ ఎక్సిజన్ సరఫరా చేస్తుంది.
4. ఆస్మా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తగ్గడానికి ఉపయోగపడతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి