పార్శ్వ తాడాసనం
ఒంగిన తాడిచెట్టు వలె ఉంటుందీ ఆసనంలో
1. కాళ్ళని రెండింటినీ రెండు అడుగుల దూరంలో ఉంచి నిలబడాలి.
2. చేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి అరచేతులు బయటకు వుండేలా చూడాలి.
3. శ్వాస పీలుస్తూ రెండు చేతులను తలపైకి తీసుకురావాలి.
4. శ్వాసవిడుస్తూ కటి భాగము నుండి ఎడమప్రక్కకి మెల్లగా నడుము వంచాలి.
5. కొంతసేపు అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ యథాస్థితికి రావాలి.
6. అదే ప్రకారంగా కుడివైపున కూడా చేయాలి. ఈ ప్రకారంగా 5 నుండి 10 సార్లు చేయడం మంచిది.
ప్రయోజనాలు:
మీ నడుము, వీపు, పొట్ట, కటి భాగాలకు వ్యాయామం కలుగుతుంది.
నడుము నొప్పి (స్టిఫ్సస్) గలవారికి ఉత్తమమైన ఆసనం.
ఎక్కువ కాలము కుర్చీలో ఉండి పనిచేసేవారికి ప్రయోజనకరమైందీ ఆసనం.
ఈ ఆసనం ఆఫీసులో ఉన్నప్పుడు కండరాల రిలాక్సేషన్ కొరకు వేయవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి