యోగా (Yoga)_అష్టాంగ యోగ


                     
  

యోగా (Yoga)_అష్టాంగ యోగ

      యోగ అనగా కలయిక అని అర్థం. మనసు , ప్రకృతి కలిసి పోవడమే యోగ. దీనికి బుద్దుని తరువాత 300 సం.రాలకు వచ్చిన పతంజలి, బుద్దుడు తన  విపాసన ధ్యానం లో చెప్పిన ఏడు మార్గాలను తీసుకొని అదనంగా ఒక మార్గాన్ని తానే ప్రతిపాదించి మొత్తం అష్టాంగ(ఎనిమిది) మార్గాలను ఏర్పరిచారు. ఇవి ఒకరకంగా ధ్యానానికి సంబంధించి నవే తప్ప వ్యాయామానికి సంబంధించినవి కాదు.
        పతంజలి క్రీ.పూ.2 వ శతాబ్ద కాలం నాటి వాడు. ఆయన  యోగా ను ఆరోగ్యశాస్త్రంగా చెప్పలేదు. 
           పతంజలి సాంఖ్య సంప్రదాయానికి సంబంధించిన వాడు. ఇతను తమిళుల సిద్ధ సంప్రదాయం లో ఉన్న 18 సిద్దపురుషులలో ఒక సిద్దుని గా భావిస్తున్నారు .
          పతంజలి "యోగ సూత్రాలు" రాశాడు. పతంజలి  దీనితో బాటు 'పాణిని'  రాసిన అష్టాద్యాయి కి కూడా భాష్యం రాశాడు. పతంజలి యోగ సూత్రాలు లో   196 భారతీయ సూత్రాలు (సూక్ష్మరూపాలు)ఉంటాయి.  దీనిని సుమారు నలభై భారతీయ భాషలలోకి, రెండు భారతీయేతర భాషలకు అనువదించారు.
          ఇటీవల కాలంలో యోగాసనాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. యోగా అనేది శరీరాన్ని సరిగా వుంచడానికి ఉపయోగం పడే వ్యాయామాల కలయిక.జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్యసమితి సమితి ప్రకటించింది.
       ఆసనాలు ఐదు రకాలుగా విభజించారు. 
అవి 1.నిలబడి చేసేవి 
       2.కూర్చుని చేసేవి 
       3.పొట్ట మీద పడుకుని చేసేవి, 
       4.వెల్లకిలా పడుకుని చేసేవి. 
       5) తలకిందులుగా చేసేవి.  
 నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు 
స్పైన్ అలైన్‌మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడను ధృఢత్వాన్ని అందిస్తుంది.  

1. కూర్చుని వేసేవి : 
      వజ్రాసనం, పద్మాసనం మొదలైనవి.
2. నిలబడి వేసేవి : 
    వృక్షాసనము, నటరాజాసనం మొదలైనవి.
3. బోర్లా పడుకుని చేసేవి :
      భుజంగాసనం,ధనురాసనం మొదలైనవి.
4. వెల్లికిలా పడుకొని చేసేవి  : 
       పవనముక్తాసనం,నౌకాసనం మొదలైనవి
5. తలకిందులుగా చేసేవి  :
     ‌‌    శీర్షాసనము, సర్పంగాసనము మొదలైనవి.


       మన శరీరపు బరువులో ప్రతి కి.గ్రా.కు కనీసం 40మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరపు బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది.
 ఆహారం తీసుకున్న అనంతరం ప్రతిసారి కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది.  

       ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు.  ఆసనాలు వేసే ప్రదేశం చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి.   తొలుత పొట్ట, మూత్రాశయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు.  ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. 

ఆసనమైనా, ప్రాణయామమైనా... సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ చేయగలరో అంతవరకే చేయాలి.  యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది.  

           అష్టాంగ యోగ లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ,ధ్యానసమాధి అనే ఎనిమిది మార్గాలను ఆయన ప్రతిపాదించాడు.

1)యమము:

అహింస: 
               నీ వల్ల, నీ మాటల వల్ల ఎవ్వరినీ
బాధించకుండా ఉండటమే అహింస

సత్యం: 
         ప్రాణం పోయినా సరే సత్యాన్నే పలకడం

అసేయం:
       పరుల సొత్తు దొంగలించకుండా ఉండటం, ఆ దొంగతనం ఏ రూపంలో ఉన్నా అరికట్టడం.

బ్రహ్మచర్యం :
           పెళ్ళికాకుండా ఆంజనేయస్వామి భక్తునిలా ఉండటం కాదు. ఇక్కడ బ్రహ్మచర్మం అర్ధం ఒకటే మాట... ఒకటే బాణం... ఒకటే భార్య.. అదే రాముడి
బాట.

అపరిగ్రహణం: నీకున్నదానిలో నువ్వు తృప్తిపడు, సంతోషించు, ఆశించకు,ఆరాటపడకు, ఆందోళన చెందకు.

2)నియమం:

శాచం: 
        శుభ్రత, మంచి బట్టలతోపాటు పై శరీరంతో పాటుమనసుని శుభ్రంగా ఉంచటం. ఈ శరీరం శుభ్రత లేకపోయినా పర్వాలేదు. మనసు
శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ మనసు మళ్ళీ జన్మ ఎత్తాలి.

సంతోషం :
       ప్రొద్దుటి నుంచి కష్టపడ్డారు మీకు వందవచ్చింది. పక్కవాడికి రెండొందలొచ్చింది. వంద గురించి ఆలోచించి నీ కర్మనిబట్టి ప్రతిఫలమని సంతృప్తి
చెందు. అప్పుడే సుఖం, అదే సంతోషం.

తపస్సు: 
            జీవన పోరాటంలో అనేక దెబ్బలు తగులుతుంటాయి. మంచిజరిగినప్పుడు ఎగరొద్దు, చెడు జరిగినప్పుడు విరగొద్దు, బ్యాలెన్స్... దేనికి చలించకుండా ఉండటమే తపస్సు

సాధ్యాయం: 
        నిన్ను నీవు తెలుసుకోవటం. గ్రంథపఠన ద్వారా జ్ఞానాన్ని సమపార్జించటం. సత్ సాంగత్యంతో బంధ విమోచనకు దారి కనుక్కోవటం.

ఈశ్వర ప్రణిధానం: 
        సర్వం సహా ఈశ్వర అర్పితం. మనల్ని సృష్టించిన ఆ శక్తికే అంతా అర్పితం. అదే ఈశ్వర ప్రణిధానం.

3) ఆసనాలు:

        ఏ పద్ధతిలో అయితే సుఖంగా కూర్చొగలమో, అదే ఆసనమని శెలవిచ్చారు పతంజలి. అసనాల సమయంలో ఏలాంటి ఇబ్బందికి లోనయినా ఆసనంలోంచి,బైటికొచ్చేయ్యాలి.

4) ప్రాణాయామం:
         శ్వాసని బంధించటం, క్రమబద్ధీకరించటమే ప్రాణాయామం. అలాశ్వాసని నియంత్రించడం ద్వారా చెడు వాయువు బైటికెళ్ళి ప్రాణవాయువు చేరుతుంది.ప్రాణాయామంలోని కుంభకానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈప్రాణాయామం వల్ల రక్తం శుభ్రపడి నరాలకి బలం చేకూరుతుంది.



1)గాలి పూర్తిగా వదిలేసి 30నుండి 60 సెకన్ల వరకు
ఉపిరి బిగపట్టి ఉంచాలి .ఊపిరిని పూర్తిగా వదిలేయాలి . మొదట 6 సార్లు చేయాలి. మామూలుగా గాని వజ్రాసనంలో  గాని కూర్చొని
చేయండి.
మొదట గాలి వదిలి start చేయాలి.చివరిలో గాలి
వదిలి  stop చేయాలి.

రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని పూర్తిగా వదలాలి.
తలని కిందకి వంచుతూ రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని పూర్తిగా వీల్చలి. వదలాలి .
ఈ Phrases లో  శ్వాసను నిలబెట్టగూడదు.


2)కుడిచేతి ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు
రంధ్రాన్ని మూసి కుడి ముక్కు ద్వారా  తలవంచుతూ పూర్తిగా  గాలిని వదిలేయాలి.
అదే కుడి రంధ్రం ద్వారా గాలిని పూర్తిగా పీల్చుతూ
తలని పైకెత్తాలి .పూర్తిగా గాలి పీల్చి గాలి వదిలేయాలి.

ఇది 6 సార్లు చేయాలి.

ఒక నిమిషం బ్రేక్ ఇవ్వాలి.

3.కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని
మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా తలకిందికి
వంచుతూ గాలిని పూర్తిగా వదిలేయాలి.
అదే ముక్కు ఎడమ రంధ్రం ద్వారా తల పై కెత్తుతూ పూర్తిగా గాలిని పీల్చాలి.

ఇలా 6 సార్లు చేయాలి.

4.కుడి చేతి ఉంగరపు వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు ద్వారా తల కిందికి వంచుతూ గాలిని పూర్తిగా వదిలేయాలి.
అదే కుడి ముక్కు రంధ్రం ద్వారా తల పై కెత్తుతూ
పూర్తిగా గాలిని పీల్చాలి.

ఇలా 6 సార్లు చేయాలి.

5.తల పైకెత్తిన తర్వాత కుడి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి , ఉంగరపు వేలును ఎడమ ముక్కు రంధ్రం వైపు తీసి తలవంచుతూ
ఎడమ రంధ్రం ద్వారా గాలిని పూర్తిగా కిందకి
వదిలేయాలి.
అదే ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చుతూ
తలను పైకెత్తాలి.

6.ఎడమ రంధ్రం పై ఉంగరపు వేలును మూసి
బొటన వేలును కుడి రంధ్రం వైపు నుంచితీసి 
కుడి రంధ్రం ద్వారా తల కిందికి వంచుతూ గాలిని పూర్తిగా వదిలేయాలి .

ఇలా 6 సార్లు చేయాలి.

తలను పైకెత్తి నపుడు మాత్రమే వేళ్ళు మార్చాలి.

7.రెండు బొటన వేళ్ళను చెవి రంధ్రాలను
మూసేసి మిగతా నాలుగు వీళ్ళను కంటి మీద పెట్టి
మూసివేయాలి.
గాలిని ముక్కు  ద్వారా  శబ్దం చేస్తూ పూర్తిగా
వదిలేయాలి.చెవిలో శబ్దం చేస్తూ వదిలేయాలి.

ఇలా  3 సార్లు చేయాలి.

8.గాలిని పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నించాలి
పూర్తిగా పీల్చడానికి ప్రయత్నించాలి .
వీలైనంత వరకు Comfortable గా కూర్చోవాలి . నేలపై, పలక మంచంపై , కుర్చీపై మీరు ఏ place లో నైనా కూర్చుని ప్రాణాయామం చేసుకోవచ్చు .

Breathing చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయాలి. మొదట ప్రతి Exercise 6 సార్లు చేస్తూ వీలును బట్టి Experience బట్టి పెంచుకోవచ్చు .

ప్రతి Exercises మధ్యలో ఒక నిమిషం brake వదలాలి.

Benifits :
         చెవి, ముక్కు , గొంతు , తలలో మెదడు , ఊపిరితిత్తులు __ఈ భాగాలన్నీ ఆరోగ్యంగా వుండి
వాటికి ప్రాణవాయువు అంది అవి చాలా
ఆరోగ్యంగా ఉంటాయి. ఆందోళన,వత్తిడి తగ్గుతుంది.
కోపం, ఉద్వేగం తగ్గిపోతాయి.

5) ప్రత్యాహారం:
            ఇంద్రియాలు ప్రాపంచిక విషయాలపై మళ్ళకుండా నిగ్రహించటమే ప్రత్యాహారం. మన ఇంద్రియాలు 11. అవి 5 జ్ఞానేంద్రియాలు, (కన్ను, ముక్కు)చెవి,నాలుక, చర్మం 5 కర్మేంద్రియాలు (చేతులు, కాళ్ళు, వళ్ళు, జననేంద్రియం,
విరేచన ద్వారం) ఉభయేంద్రియం 1.మనస్సు.

6. ధారణ:
        ఏకాగ్రత, మనసుని బంధించుట, రూపం, శబ్దం, ఊహ,మంత్రం ఏదైనా సరే. ఒకదాని మీద కేంద్రీకరించుట ధారణ. ఈ ధారణనుంచే ధ్యానానికి మార్గం సుగమం అవుతుంది.

7. ధ్యానం
           ఇందులో రెండు రకాలు, సగుణధ్యానం భగవంతుని గురించి ధ్యానం చేయడం.
రెండోది నిర్గుణ ధ్యానం. ఆత్మ రూపాన్ని ధ్యానం చేయడం. 

8. సమాధి:
       ఇదొక  ధ్యాన మార్గం. చాలా మంది తీవ్రంగా ధ్యానం చేస్తుంటారు. దీనికి వారు పెట్టిన పేరు సమాధి. 
        

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid