శారీరక పెరుగుదల__ శక్తి


    భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. 
          కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పొచ్చు.
          అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.     అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం.

మనకు శక్తి ఎందుకు అవసరం?

మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం, శరీర ఉష్ణోగ్రతను
స్థిరంగా ఉంచటానికి, జీర్ణక్రియలకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం.

జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం, మన దేశంలో 50శాతం మంది మహిళలు, పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.
           ఆహారంలో లభించే కాలరీలు, పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని  క్యాలరీలు  అంటారు.

• ఒక మనిషికి ఎంత శక్తి అవసరమనేది అతడు/ఆమె ప్రతి రోజు పడే శారీరక శ్రమపై ఆధారపడి
ఉంటుంది. వయస్సు, లింగ భేదం శరీర బరువు, పెరుగుదల, శరీరం పని పాటలు ఒత్తిడిని బట్టి ఇది
మారుతుంటుంది. భారత దేశంలో 70-80 శాతం మంది ప్రధాన గింజ ధాన్యాలు, పప్పు దినుసులు,
చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తున్నారు.

• పిల్లలు కౌమార దశ వారు 55-60 శాతం రోజువారి కాలరీలను పిండి పదార్ధాల ద్వారాపొందుతున్నారు.
కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగటానికి ఎక్కువ కాలరీలు అవసరం. ఉదాహరణకు 16-18
ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజు కనీసం 2060కిలో క్యాలరీలు గల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అదే వయస్సు అబ్బాయిలకైతే 2640 కిలో కాలరీలు అవసరం. గర్భవతులకైతే  అదనపు క్యాలరీలు ఆహారం ఇవ్వాలి. పిండం ఎదుగుదలకు, గర్భవతి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం.

       అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే పోషణ లోపానికి దారి తీస్తుంది. అధికంగా తీసుకుంటే ఊబకాయం (లావు) కు దారి తీస్తుంది.

అధిక శక్తిని ఇచ్చే ఆహర పదార్థాలు :

1. ప్రధాన గింజ ధాన్యాలు,చిరు ధాన్యాలు పప్పు దినుసులు, దుంప కాయగూరలు, పంట
నూనెలు,వనస్పతి,నెయ్యి, వెన్న నూనెలు విత్తనాలు,గింజకాయలు చెక్కర, బెల్లం తదితరాలు.

2. మనకు కాలరీలు ఎక్కువగా గింజ ధాన్యాలు నుంచి లభిస్తున్నాయి, కనుక గింజ ధాన్యాలు, చిరు
ధాన్యాల్లో వివిధ రకాలను వినియోగించేలా చొరవ చూపాలి.

3. జొన్నలు, సజ్జలు లాంటి ముతక ధాన్యాలు, రాగులు లాంటి చిరు ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

మెనోపాస్/ఆండ్రోపాస్