ఆసనాలు 5 రకాలు
ఆసనాలు ఐదు రకాలుగా విభజించారు.
అవి 1.నిలబడి చేసేవి
2.కూర్చుని చేసేవి
3.పొట్ట మీద పడుకుని చేసేవి,
4.వెల్లకిలా పడుకుని చేసేవి.
5) తలకిందులుగా చేసేవి.
నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు
స్పైన్ అలైన్‌మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడను ధృఢత్వాన్ని అందిస్తుంది.
1. కూర్చుని వేసేవి :
వజ్రాసనం, పద్మాసనం మొదలైనవి.
2. నిలబడి వేసేవి :
వృక్షాసనము, నటరాజాసనం మొదలైనవి.
3. బోర్లా పడుకుని చేసేవి :
భుజంగాసనం,ధనురాసనం మొదలైనవి.
4. వెల్లికిలా పడుకొని చేసేవి :
పవనముక్తాసనం,నౌకాసనం మొదలైనవి
5. తలకిందులుగా చేసేవి :
శీర్షాసనము, సర్పంగాసనము మొదలైనవి.
మన శరీరపు బరువులో ప్రతి కి.గ్రా.కు కనీసం 40మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరపు బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది.
ఆహారం తీసుకున్న అనంతరం ప్రతిసారి కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది.
ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. ఆసనాలు వేసే ప్రదేశం చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి. తొలుత పొట్ట, మూత్రాశయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు. ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు.
ఆసనమైనా, ప్రాణయామమైనా... సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ చేయగలరో అంతవరకే చేయాలి. యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి